Australia vs West Indies 3rd T20: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు, స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. తానెందుకు యూనివర్సల్ బాస్ అయ్యాడో మరో మైలురాయితో చెప్పకనే చెప్పేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా టీ20ల్లో ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైన క్రికెటర్‌గా క్రిస్ గేల్ నిలిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరీబియన్ క్రికెటర్ క్రిస్ గేల్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి వెస్టిండీస్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. క్రిస్ గేల్ (Chris Gayle) 38 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 67 పరుగులు చేయడంతో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై మూడో టీ20లో విండీస్ విజయం సాధించింది. డారెన్ సమీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 141 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలో 14,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఐ యామ్ బ్యాక్ అంటూ వెస్టిండీస్ అభిమానులకు మంచి ఇన్నింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.


Also Read: Suresh Raina on Virat Kohli: ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గలేదు, సురేష్ రైనా కామెంట్స్ వైరల్



2016 అనంతరం టీ20లలో విండీస్ తరఫున గేల్ నమోదు చేసిన తొలి హాఫ్ సెంచరీ ఇది. మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ.. బ్యాట్‌తో సత్తా చాటడానికి చాలా కష్టపడ్డాను. చాలా రోజుల తరువాత కీలక ఇన్నింగ్స్ ఆడటం సంతోషంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ టీ20 సిరీస్ విజయం సాధించడం పట్ల గేల్ హర్షం వ్యక్తం చేశాడు. విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్‌ (West Indies Captain Nicholas Pooran)ను తన వంతు సహకారం అందించాలని భావించినట్లు గేల్ తెలిపాడు. గొప్ప ప్రత్యర్థిపై తమకు అద్భుతమైన సిరీస్ అని వ్యాఖ్యానించాడు.


Also Read: Wimbledon 2021 Winner: వింబుల్డన్ 2021 విన్నర్ Novak Djokovic, అత్యధిక టైటిల్స్‌తో రికార్డు


కాగా, తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 14 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి  80 పరుగులకు ఆస్ట్రేలియా పరిమితమైంది. ఓపెనర్లు మాథ్యు వేడ్ (23), ఆరోన్ ఫించ్ (30) శుభారంభాన్నిచ్చినా, మిచెల్ మార్ష్ 09, అలెక్స్ క్యారీ 13 వికెట్లను త్వరగా కోల్పోయింది. లోయర్ ఆర్డర్ రాణించడంతో ఆసీస్ 141 పరుగులు చేసింది. 5 టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ ఇప్పటికే 3-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. నామమాత్రమైన రెండు టీ20లు జరగాల్సి ఉంది. గేల్ రాకతో టీ20ల్లో వెస్టిండీస్ మరింతగా బలోపేతమైంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook