Abu Dhabi T10: Chris Gayle విధ్వంసం, టీ10లో మెరుపు ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి జట్టు ఫిదా
Chris Gayle Slams Joint Fastest Half Century : వయసు పెరిగేకొద్దీ తనలో సత్తా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదని మెరుపు ఇన్నింగ్స్‌తో నిరూపించుకున్నాడు యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్. 45 ఏళ్ల వరకు క్రికెట్ ఆడతానని చెప్పిన మాటలకు ఈ ఇన్నింగ్స్ నిదర్శనంగా కనిపిస్తోంది.
Chris Gayle Slams Joint Fastest Half Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) కోసం యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌గేల్ సన్నద్దమవుతున్నాడు. తాజాగా అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్‌లో సునామీ లాంటి ఇన్సింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2021లో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ప్రమాదకర సంకేతాలు ఇచ్చాడు. దీంతో లక్ష్యాన్ని కేవలం 5.3 ఓవర్లలోనే క్రిస్‌గేల్ జట్టు ఛేదించడం గమనార్హం.
టీ10 లీగ్‌లో భాగంగా మరాఠా అరేబియన్స్, టీమ్ అబుదాబి జట్ల మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్ 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. అబుదాబి జట్టుకు 98 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(11) విఫలమై నా, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్(Chris Gayle) వెనక్కి తగ్గలేదు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రికార్డును సమం చేశాడు.
Also Read: Chris Gayle retirement plans: క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఇవే
తొలి ఓవర్ నుంచే మరాఠా అరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించిన గేల్ వీర విహారం చేశాడు. క్రిస్‌గేల్(84 నాటౌట్; 22 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌తో కేవలం 5.3 ఓవర్లలోనే అబుదాబి జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం ఒక్క వికెట్ నష్టపోయి అబుదాబి జట్టు 98 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. వయసు పెరిగేకొద్దీ తనలో సత్తా పెరుగుతుందని ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించుకున్నాడు క్రిస్‌గేల్.
Also Read: Chris Gayle: మరో అరుదైన ఘనతను సాధించిన యూనివర్సల్ బాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook