Chris Gayle retirement plans: క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఇవే

క్రిస్ గేల్ రిటైర్మెంట్‌పై ఓ క్లారిటీ వచ్చింది. మరో రెండు టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌లు ఆడిన తర్వాతే తాను రిటైర్ అవుతానని క్రిస్ గేల్ స్పష్టంచేశాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ వయస్సు 41 ఏళ్లు కాగా.. త‌న‌కు మరో ఐదేళ్లు క్రికెట్ ఆడేంత స‌త్తా ఉంద‌ని, 45 ఏళ్ల‌కు ముందే క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనే లేద‌ని గేల్ తేల్చిచెప్పాడు.

Last Updated : Jan 2, 2021, 12:22 AM IST
Chris Gayle retirement plans: క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఇవే

క్రిస్ గేల్ రిటైర్మెంట్‌పై ఓ క్లారిటీ వచ్చింది. మరో రెండు టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌లు ఆడిన తర్వాతే తాను రిటైర్ అవుతానని క్రిస్ గేల్ స్పష్టంచేశాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ వయస్సు 41 ఏళ్లు కాగా.. త‌న‌కు మరో ఐదేళ్లు క్రికెట్ ఆడేంత స‌త్తా ఉంద‌ని, 45 ఏళ్ల‌కు ముందే క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనే లేద‌ని గేల్ తేల్చిచెప్పాడు. ఆటకు వయస్సు అడ్డం కాదని.. వ‌య‌సు అనేది కేవ‌లం ఒక నెంబ‌ర్ మాత్రమే అని క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. అల్టిమేట్ క్రికెట్ చాలెంజ్ ( UKC tourney ) టోర్నమెంట్‌లో భాగంగా మాట్లాడుతూ క్రిస్ గేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. క్రిస్ గేల్ చెప్పినదాని ప్రకారం 2021 తో పాటు 2022 టి 20 వరల్డ్ కప్ కూడా ఆడతాడన్నమాట.

క్రిస్ గేల్ తనలో ఉన్న క్రికెట్ సత్తా గురించి కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ద్వారా తాను నిజంగానే యూనివర్శల్ బాస్ ఆఫ్ క్రికెట్ అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆడుతున్న అల్టీమేట్ క్రికెట్ ఛాలెంజ్ గురించి గేల్ మాట్లాడుతూ.. 16 మ్యాచ్‌లు ఉన్న ఈ టోర్నమెంట్ మొత్తం క్రికెట్ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన, సరికొత్త టోర్నీగా అభివర్ణించాడు. ఈ టోర్నీలో లీగ్ దశలో ఒక మ్యాచ్ గెలిస్తే.. ఆ జట్టుకు 2 పాయింట్స్ లభిస్తాయని, అలా టోర్నీ చివరి వరకు ఎవరికి ఎక్కువ పాయింట్స్ లభిస్తాయో వాళ్లే విన్నర్ అవుతారని తెలిపాడు. ఒక్కో ప్లేయ‌ర్ మ‌రో ప్లేయ‌ర్‌తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అలా మొత్తం 4 ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉండగా.. ఒక్కో ఇన్నింగ్స్‌లో 15 బంతులు‌ ఉంటాయని గేల్ వివరించాడు. 

Also read : Rohit Sharma: వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ రోహిత్ శర్మకు పగ్గాలు

క్రికెట్‌లోనే ఇదో సరికొత్త రకమైన ఫార్మాట్ అవడంతో టోర్నీ పట్ల ఎంతో ఆసక్తి ఏర్పడినట్టు క్రిస్ గేల్ ( Chris Gayle ) పేర్కొన్నాడు. దుబాయ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో క్రిస్ గేల్‌తోపాటు యువ‌రాజ్ సింగ్‌, ఇయాన్ మోర్గాన్‌, ఆండ్రీ ర‌సెల్‌, కెవిన్ పీట‌ర్స‌న్‌, ర‌షీద్ ఖాన్ లాంటి ఫేమస్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పాల్గొంటున్నారు.

Also read : Indian Cricketers Retired In 2020: ఈ ఏడాది రిటైరైన భారత క్రికెటర్లు వీరే

Trending News