బీసీసీఐ అధికారులైనా స్టేడియంలోకి అడుగు పెడితే ప్రేక్షకుల క్రిందే లెక్క. ఇక నుండి సాధారణ ప్రేక్షకుల మాదిరిగా ఉచితంగా కాకుండా డబ్బులు పెట్టి టిక్కెట్లు కొని మరీ మ్యాచ్‌లు చూడాల్సిందే. ఈ మేరకు పాలకుల కమిటీ నిర్ణయం తీసుకుంది. జులై 3వ తేది నుండి  భారత్‌-ఇంగ్లాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొద్ది రోజుల నుండి పాలకుల కమిటీకి, బీసీసీఐకి మధ్య జరుగుతున్న వైరమే ఈ పరిస్థితికి కారణం అయ్యి ఉండవచ్చనేది పలువురి అభిప్రాయం. అదేవిధంగా అధికారుల ప్రయాణ ఖర్చుల విషయంలో కూడా నిక్కచ్చిగా ఉంటామని పాలకుల కమిటీ తెలిపింది. అధికారికంగా సంస్థ కార్యకలాపాల కోసం వెళ్తేనే ఖర్చులకు డబ్బు చెల్లిస్తామని.. అంతకు మించి వేరే కారణాల రీత్యా ఎక్కడికైనా వెళితే ఎవరి ఖర్చులు వారే పెట్టుకోవాలని కమిటీ తెలిపింది.


ఈ మేరకు సెక్రటరీ అమితాబ్ చౌదరితో పాటు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీకి కూడా సమాచారాన్ని అందించింది. అయితే ఈ సమాచారానికి జోహ్రీ కూడా కాస్త కఠినంగానే జవాబిచ్చారు. ‘జూన్‌ 26 తేదిన డబ్లిన్‌ వెళ్తు్న్నాను. జులై 8 తేదిన ముంబయి వస్తాను. భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జులై 3, 6 తేదిల్లో జరిగే టీ20 మ్యాచ్‌లకు కూడా నేను వస్తాను. మీకు తెలియజేయాలనే ఈ సమాచారం అంతా ఇస్తున్నాను’ అని జోహ్రీ కూడా కాస్తా వ్యంగ్య ధోరణిలోనే జవాబిచ్చారు.