బ్రేకింగ్ న్యూస్: బీసీసీఐపై కోహ్లీ ఫైర్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరికలేకుండా ఒకదాని వెనక ఒకటి సిరీస్ షెడ్యూల్ నిర్వహించడంపై అభ్యంతరం తెలిపారు. శ్రీలంక-భారత్ టెస్ట్ క్రికెట్ ముగిసిన వెంటనే టీమిండియా సౌత్ ఆఫ్రికా కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ..గట్టిగా స్పందించారు.
తమకు నెలరోజుల సమయం దొరినట్లయితే దక్షిణాఫ్రికా పర్యటనకు ప్రిపేర్ అయ్యేవాళ్లం. కానీ రెండు రోజులే సమయం ఇచ్చారు. సిరీస్ ఆడటంతో సరైన ప్లాన్ ఉండాలి. ఇలా వరుస పెట్టి మ్యాచ్లు ఆడుకుంటూ పోతే జట్టులో ఉన్న ఆటగాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది" అని వ్యాఖ్యానించారు.