Ipl 2022 Love Proposal In Cricket Match: ఐపీఎల్‌ లో నిన్న (బుధవారం) చెన్నై- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ హోరాహోరీగా జరిగింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ జట్టే.. మ్యాచ్‌ లో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 174 పరుగుల టార్గెట్‌ ను చేధించడంలో ధోనీ సేన విఫలమైంది. దీంతో 13 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు విక్టరీ కొట్టింది.  అయితే గ్రౌండ్‌ లో మ్యాచ్‌ జరుగుతుంటే.. స్టాండ్స్‌ లో ఓ అమ్మాయి ఆర్సీబీ ఫ్యాన్‌ అయిన ఓ అబ్బాయికి లవ్‌ ప్రపోజ్‌ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టార్గెట్‌ ఛేజింగ్‌ లో భాగంగా సీఎస్‌కే బ్యాటింగ్‌ చేస్తున్న 11వ ఓవర్లో ఈ లవ్‌ ప్రపోజల్‌ సీన్‌ జరిగింది. సీఎస్‌కే ఆటగాడు కాన్వే బ్యాటింగ్‌ చేస్తుండగా.. హసరంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అప్పుడే ఆఫ్‌ ద గ్రౌండ్‌ లో ఓ అమ్మాయి ఓ అబ్బాయికి మోకాళ్లపై కూర్చోని లవ్‌ ప్రపోజ్‌ చేసింది. దానికి అబ్బాయి కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి తన లవర్‌కు ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచింది. ఒకరికొకరు హగ్‌ చేసుకున్నారు.




ఆ లవ్‌ ప్రపోజల్‌ కు శుభాకాంక్షలు తెలిపినట్టుగా.. ఆ తర్వాత బాల్‌ కే కాన్వే ఓ భారీ సిక్స్‌ కొట్టాడు. ఇదంతా చూస్తున్నవారంతా ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.


Also Read: Hyderabad MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి టికెట్ ధరల తగ్గింపు...


Also Read: నన్ను ఇస్లాంలోకి మారమని షాహిద్ అఫ్రిది ఒత్తిడి తెచ్చాడు: భారత స్పిన్నర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.