నన్ను ఇస్లాంలోకి మారమని షాహిద్ అఫ్రిది ఒత్తిడి తెచ్చాడు: భారత స్పిన్నర్

Danish Kaneria about Shahid Afridi. పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. హిందువైన తనపట్ల తరచుగా అనుచితంగా ప్రవర్తించేవాడనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 08:23 AM IST
  • నన్ను ఇస్లాంలోకి మారమని షాహిద్ అఫ్రిది ఒత్తిడి తెచ్చాడు
  • ఎక్కువగా బెంచ్‌కే పరిమితం చేసేవాడు
  • బాగా రాణించినా మ్యాచ్ ఆడకుండా చేసేవాడు
నన్ను ఇస్లాంలోకి మారమని షాహిద్ అఫ్రిది ఒత్తిడి తెచ్చాడు: భారత స్పిన్నర్

Danish Kaneria says Shahid Afridi forced to me to convert in to Islam: భారత సంతతి ఆటగాడు, పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. తన సహచర ఆటగాడు, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. హిందువైన తనపట్ల తరచుగా అనుచితంగా ప్రవర్తించేవాడనున్నారు. ఇస్లాంలోకి మారమని అఫ్రిది తనను బలవంతం చేశాడని కనేరియా ఆరోపించారు. పాకిస్తాన్‌కు క్రికెట్‌ ఆడినంత కాలం  అఫ్రిది తనను తోటి ఆటగాళ్ల ముందు హేళన చేసేవాడని చెప్పారు. జీ న్యూస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కనేరియా పాక్ జట్టులో తాను ఎదుర్కొన్న వివక్షతను చెప్పుకొచ్చారు. 

'నా సమస్య గురించి బహిరంగంగా మాట్లాడిన మొదటి వ్యక్తి షోయబ్ అక్తర్. అయితే ఎప్పుడూ నన్ను కించపరిచే ప్రయత్నం చేసే ఆటగాడు మాత్రం షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్‌కు క్రికెట్‌ ఆడినంత కాలం అతడు నన్ను హేళన చేసేవాడు. తోటి ప్లేయర్స్ ముందు అవమానంగా మాట్లాడేవాడు. ఇద్దరం కలిసి ఒకే జట్టుకు చాలా ఏళ్ల పాటు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాం. ఆఫ్రిది కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్‌కే పరిమితం చేసేవాడు. దాంతో నేను చాలా వన్డే మ్యాచ్‌లకు దూరం అయ్యా' అని డానిష్ కనేరియా అన్నారు. 

'ఇంజమామ్-ఉల్-హక్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, మొయిన్ ఖాన్, రషీద్ లతీఫ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడూ నాకు మద్దతుగా ఉండేవారు. కానీ షాహిద్ అఫ్రిది కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను బాగా రాణించినా కూడా మ్యాచ్ ఆడకుండా చేసేవాడు. నేను హిందువు కాబట్టి దేశంలో చోటు లేదని, జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు నూరిపోసేవాడు. నన్ను ఇస్లాంలోకి మారమని ఒత్తిడి తెచ్చాడు. కానీ నేను అతనిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. నేను నా మతాన్ని నమ్ముతాను' అని కనేరియా పేర్కొన్నారు. 

'షాహిద్ అఫ్రిదీకి నాతో ఏ సమస్య ఉందో నాకు తెలియదు. కానీ అతను నన్ను ఎప్పుడూ చులకనగా చూసేవాడు. ఈ సంఘటనలన్నీ నన్ను మానసికంగా కలిచివేశాయి. కానీ ఒక్కటి మాత్రం చెపుతా.. పాకిస్తాన్‌ జట్టుకు ఆడడం నా అదృష్టంగా భావిస్తా. క్రికెట్‌లో ఫిక్సింగ్‌ చేసిన ఎంతో మంది బయట తిరుగుతున్నారు. కానీ నాపై ఉన్న నిషేధాన్ని మాత్రం పీసీబీ తొలగించలేదు. మాజీ ఛైర్మన్ మహమ్మద్ ఇజాజ్ బట్‌తో సహా పీసీబీ బోర్డు నా అభ్యర్థనలు లేదా ఫిర్యాదులను పట్టించుకోలేదు. నన్ను జట్టుకు దూరంగా ఉంచడానికి వ్యూహరచన చేశారు' అని కనేరియా ఆరోపించారు.పాక్‌ తరపున కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టారు.

Also Read: SVP Pre Release Event: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అప్‌డేట్... ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..?

Also Read: Saroor Nagar Honour Kiling: హైదరాబాద్‌లో పరువు హత్య... నడిరోడ్డుపై గడ్డపారలతో దాడి... యువకుడు అక్కడికక్కడే మృతి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News