Australia Implements New Idea To Avoid Slow Over Rate Penalty: స్లో ఓవర్‌ రేట్‌ క్రికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారుతున్న విషయం తెలిసిందే. గతంలో స్లో ఓవర్ రేట్‌కు ఆటగాళ్లకు ఐసీసీ జరిమానాలు విధించేంది. అయితే ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. స్లో ఓవర్‌ రేట్‌ నమోదైతే.. ఫీల్డింగ్ జట్టులో కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణం పవర్ ప్లే టైమ్‌లో 30 యార్డ్ సర్కిల్‌ బయట ఐదుగురు ఫీల్డర్లను సెట్ చేసుకోవచ్చు. కానీ స్లో ఓవర్ రేట్ నమోదైతే.. 30 యార్డ్ సర్కిల్‌ బయట నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉంచాలి. ఈ నిబంధన బ్యాటింగ్ జట్టుకు బాగా కలిసివస్తోంది. కేవలం నలుగురు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ బయట ఉండడంతో ఈజీగా పరుగులు బాదేస్తున్నారు. దీంతో మ్యాచ్ ఫలితమే మారిపోతోంది. 


బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లు బాదిన తరువాత బంతి మళ్లీ బౌలర్ చేతికి వచ్చేందుకు సమయం పడుతోంది. ముఖ్యంగా ఫోర్లు కొట్టిన సమయంలో బౌండరీ లైన్ వద్దకు ఫీల్డర్ వెళ్లి బాల్ తీసుకువచ్చేందుకు టైమ్ పడుతోంది. ఇది కూడా స్లో ఓవర్ రేట్‌కు ఓ కారణం అవుతోంది.  


ఈ నేపథ్యంలోనే స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకునే క్రికెట్ ఆస్ట్రేలియా సరికొత్త ఐడియా వేసింది. బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదిన ప్రతిసారి ఫీల్డర్లు పరిగెత్తాల్సిన పనిలేకుండా ప్లాన్ చేసింది. బౌండరీ లైన్ దగ్గర గ్రౌండ్ స్టాఫ్‌ను.. డగౌట్‌లో కూర్చున్న ఆటగాళ్లను ఉంచుతోంది. బాల్ బౌండరీ లైన్ క్రాస్ చేయగానే.. వీళ్లు బంతిని వెంటనే ఆటగాళ్లకు అందిస్తారు. దీంతో చాలా టైమ్ సేవ్ అవుతోంది. స్లో ఓవర్ రేట్ దాదాపు నియంత్రణలోకి వస్తుంది.


 




ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఈ ప్లాన్‌ను అమలు చేసింది. ఈ మ్యాచ్‌లో వర్కవుట్ కావడంతో టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాటించనుంది. ఇందుకోసం ఐసీసీ నుంచి పర్మిషన్ కూడా తీసుకుంది. ఇప్పటికే క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో అన్ని జట్లు ఇలా చేసి స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకుంటున్నాయి.


ఈ ఐడియా గురించి ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆష్టన్ అగర్ మాట్లాడాడు. "ఇది మా ప్రణాళికలో భాగం. ఇలా చేయడం వల్ల గేమ్ మరింత స్పీడ్‌గా సాగుతుంది. అన్ని జట్లు చాలా సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పవర్‌ప్లే సమయంలో బౌండరీ లైన్ దగ్గరకు ఫీల్డర్ వెళ్లి బంతి తీసుకువచ్చేందుకు టైమ్ పడుతోంది. సమయం వృథా అవ్వకుండా అదనపు ఆటగాళ్లకు ఈ బాధ్యత ఇవ్వాలని మేము భావించాం. మంచి ఫలితాన్ని ఇస్తోంది.." అంటూ అతను చెప్పుకొచ్చాడు.


Also Read: Virat kohli Last T20 WC: విరాట్‌ కోహ్లీకి టీ20 ప్రపంచకప్‌ 2022 చివరిదా.. కోచ్‌ ఏంచెప్పాడంటే?


Also Read: Dream 11 Winner: డ్రీమ్ 11తో జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన గిరిజనుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook