Virat kohli Last T20 WC: విరాట్‌ కోహ్లీకి టీ20 ప్రపంచకప్‌ 2022 చివరిదా.. కోచ్‌ ఏంచెప్పాడంటే?

T20 World Cup 2022 is not Virat Kohli's Last T20 WC says Rajkumar Sharma. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ 2022నే చివరిది అని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తలపై విరాట్ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ స్పందించారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 20, 2022, 09:12 AM IST
  • ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2022
  • కోహ్లీకి టీ20 ప్రపంచకప్‌ 2022 చివరిదా
  • కోచ్‌ ఏంచెప్పాడంటే?
Virat kohli Last T20 WC: విరాట్‌ కోహ్లీకి టీ20 ప్రపంచకప్‌ 2022 చివరిదా.. కోచ్‌ ఏంచెప్పాడంటే?

Rajkumar Sharma says Virat Kohli played T20 World Cup 2024 also: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2022 జరుగుతోంది. క్వాలిఫైయర్, వార్మప్ మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 మ్యాచులు ఆరంభం కానున్నాయి. ప్రపంచకప్‌ టైటిల్ ఫేవరేట్లల్లో భారత్ కూడా ఒకటి. ఇందుకోసం ఇండియన్ ప్లేయర్స్ ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఈ సమయంలో భారత అభిమానులను ఓ వార్త కలవరపాటుకు గురిచేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలపై కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ స్పందించారు.

ఇప్పటికే ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వన్డేలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సిరీస్‌లు, లీగ్ టోర్నీలతో తీరిక లేకుండా మ్యాచులు ఆడాల్సిరావడంతో ఈ ఇద్దరు వన్డేల నుంచి తప్పుకున్నారు. ఇదే కారణంతో విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని.. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడతాడని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ తాజాగా ఈ అంశంపై మాట్లాడుతూ.. 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడుతాడు అని స్పష్టం చేశారు. 

ఇండియా న్యూస్‌తో రాజ్‌కుమార్‌ శర్మ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీకి ఇది చివరి టీ20 ప్రపంచకప్ కాదు. అతను చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందిస్తాడు. ఫామ్, ఫిట్‌నెస్, పరుగులు చేయడం మరియు మ్యాచ్‌లు గెలవాలనే కసి టీ20 ప్రపంచకప్‌ 2024లో కూడా కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎంతో ఒడిదుడుకులను అధిగమించి తానేంటో కోహ్లీ నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరింత తాజా దనంతో ఆసక్తిగా కనబడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2022ని భారత్ విజయం సాధించడంలో విరాట్ కీలక పాత్ర పోషిస్తాడని నేను నమ్ముతాను' అని అన్నారు. 

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకూ 102 టెస్టులాడి 49.5 సగటుతో 8074 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 57.5 సగటుతో 12254 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 63 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 105 టీ20లలో 50.8 సగటుతో 3701 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఓ సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు బాదాడు. 

Also Read: దీపావళికి ముందే ఈ రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం.. ఇక వీరికి తిరుగుండదు..
Also Read: Kapil Dev Comments: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా స్థానంపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News