Sachin Tendulkar Reacts on Four day Test format: ఐసీసీ ప్రతిపాదనకు నో చెప్పిన సచిన్
మనకు వన్డేలు, ట్వంటీ20లు, టీ10, వంద బంతుల ఫార్మాట్ క్రికెట్ మ్యాచ్‌లున్నాయి. కానీ టెస్ట్ ఫార్మాట్ మాత్రమే క్రికెట్‌కు సరైన విధానం. భావితరాలను క్రికెట్ వైపు మరింతగా ఆకర్షించేందుకు ఇలా ఫార్మాట్లలో మార్పులు చేయడం సరైన నిర్ణయం కాదు.
ముంబై: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) చేసిన నాలుగు రోజుల టెస్ట్ ఫార్మాట్ కుదింపు ప్రతిపాదనను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఇదే తీరుగా స్పందించాడు. టెస్ట్ క్రికెట్‌ను ఐదు నుంచి నాలుగు రోజులు చేయడం క్రికెట్‌కు మంచిది కాదని, ఆట కళ తప్పుతుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. చివరిదైన ఐదో రోజు స్పిన్నర్లకు పిచ్ అనుకూలిస్తుందని, ఇలాంటి నిర్ణయాలతో స్పిన్ బౌలర్లకు ఇబ్బందులు తప్పవన్నాడు.
‘అయిదో రోజు ఆటలేకపోతే.. టెస్ట్ చివరిరోజు వరకు వేచి చూసే స్పిన్నర్లు మెరుగ్గా బౌలింగ్ చేయలేరని, ఇది వారి పాలిట శాపంగా మారుతుంది. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు స్పిన్నర్లకు పిచ్ అనుకూలించాలంటే అయిదు రోజులపాటు టెస్ట్ మ్యాచ్‌లు కొనసాగాలి. మనకు వన్డేలు, ట్వంటీ20లు, టీ10, వంద బంతుల ఫార్మాట్ క్రికెట్ మ్యాచ్‌లున్నాయి. కానీ టెస్ట్ ఫార్మాట్ మాత్రమే క్రికెట్‌కు సరైన విధానం.
భావితరాలను క్రికెట్ వైపు మరింతగా ఆకర్షించేందుకు ఇలా ఫార్మాట్లలో మార్పులు చేయడం సరైన నిర్ణయం కాదు. వన్డేల్లో రివర్స్ స్వింగ్‌ను చివరిసారిగా ఎప్పుడు చూశాం. వన్డేల్లో ప్రస్తుతం రెండు బంతులు వాడుతున్న కారణంగా రివర్స్ స్వింగ్ సాధ్యం కావడం లేదు. రివర్స్ స్వింగ్‌ను రాబట్టాలంటే బంతి కాస్త మృదువు అవ్వాలి. ఫార్మాట్లలో మార్పులు చేయడం కన్నా.. మరింత నాణ్యమైన పిచ్‌లను ఏర్పాటు చేయడం క్రికెట్‌కు ప్రయోజనం కలిస్తుందని ఐసీసీకి నా సలహా.
బౌలింగ్‌లో సీమ్, స్పిన్‌తో పాటు బౌన్స్ ఉంటేనే ఆటలో మజా వస్తుంది. ఏ ఒక్కటి లేకపోయినా క్రికెట్‌లో నాణ్యత తగ్గుతుంది. స్నిన్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్ లాంటి బౌలర్లు సైతం నాలుగు రోజుల టెస్ట్ ఫార్మాట్ నిర్ణయాన్ని తిరస్కరించడం శ్రేయస్కరం. గతంతో పోల్చితే క్రికెట్‌లో ప్రస్తుతం ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని’ సచిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సచిన్ అభిప్రాయానికి ఈతరం క్రికెటర్లతో పాటు మాజీలు సైతం మద్దతు తెలుపుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..