తండ్రయిన భారత్ క్రికెటర్.. చిన్నారి ఫొటో వైరల్
తాను తండ్రి అయిన విషయాన్ని భారత క్రికెటర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. చిన్నారి ఫొటో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటో వైరల్ అవుతోంది.
తండ్రి, కూతురు మధ్య ఎంత ప్రేమ ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో కూతురికి మొదటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది తన తండ్రేనని చెబుతారు. తాను అండ్రి అయ్యానన్న విషయాన్ని టీమిండియా క్రికెటర్ ధవల్ కుల్కర్ణి తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. తన చిట్టితల్లి ఫొటోను ట్వీట్ చేశారు. ‘వెల్ కమింగ్ మై ఏంజెల్’ అంటూ తన కూతురును ఈ ప్రపచంలోకి గ్రాండ్‌గా ఆహ్వానించాడు ఈ క్రికెటర్. జనవరి 21న తమకు కూతురు జన్మించిందని తెలిసేలా పుట్టినతేదీని క్యాప్షన్ ఇచ్చారు.
జాతీయ జట్టులోకి వచ్చిన 2016లోనే శ్రద్ధా కర్పుడేను ధవల్ కుల్కర్ణి వివాహం చేసుకున్నాడు. వీరి ముద్దుల చిన్నారి ఫొటోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. కాగా, జాతీయ జట్టులోకి మళ్లీ రావాలని ఈ పేస్ బౌలర్ ఆరాట పడుతున్నాడు. టీమిండియాలోకి 2014లో వన్డే ద్వారా అరంగేట్రం చేసిన కులకర్ణి 12 మ్యాచ్‌లాడి 19 వికెట్లు తీశాడు. రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అంతగా రాణించకపోవడం, వరుస అవకాశాలు తలుపుతట్టక పోవడంతో దేశవాలీ మ్యాచ్‌లు, ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.
[[{"fid":"181392","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"భార్య శ్రద్ధా కర్పుడేతో క్రికెటర్ ధవల్ కుల్కర్ణి (ఫైల్ ఫొటో)","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"భార్య శ్రద్ధా కర్పుడేతో క్రికెటర్ ధవల్ కుల్కర్ణి (ఫైల్ ఫొటో)","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"భార్య శ్రద్ధా కర్పుడేతో క్రికెటర్ ధవల్ కుల్కర్ణి (ఫైల్ ఫొటో)","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]