Cricketer Rishabh Pant's knee surgery Successfully Done: కారు ప్రమాదంలో గాయపడిన భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇప్పుడు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి చికిత్స పొందుతున్న పంత్ గురించి ఒక పెద్ద అప్‌డేట్ తెరమీదకు వచ్చింది. అదేమంటే రిషబ్ పంత్‌కు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ తర్వాత, స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పంత్ స్పందన బాగుందని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసుపత్రి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ శస్త్రచికిత్స కుడి కాలు మోకాలి లిగమెంట్ కు జరిగింది. ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేరిన రిషబ్‌ పంత్‌కు శుక్రవారం నాడు ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ ని డాక్టర్ దిన్షా పద్రివాలా చేశారని, ఈ శస్త్రచికిత్స తర్వాత, ఇప్పుడు రిషబ్ పంత్‌ను సుమారు 3 నుండి 4 రోజుల పాటు పరిశీలనలో ఉంటారని అంటున్నారు.


రిషబ్ పంత్ కు చేసిన ఈ ఆపరేషన్ సుమారు 3 గంటల పాటు కొనసాగిందని చెబుతున్నారు. కారు ప్రమాదం తర్వాత, రిషబ్ పంత్ తల, వీపు, కాలు, మోకాలు మరియు లిగమెంట్ పై తీవ్ర గాయాలయ్యాయి. ఇక అంతకు ముందు రిషబ్ పంత్ డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తరువాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పంత్‌ను విమానంలో తరలించి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించింది. ఇక అంతకుముందు గాయం కారణంగా శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు రిషబ్ పంత్‌ను ఎంపిక చేయలేదు.


బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లాల్సిందిగా రిషబ్ పంత్‌ను బీసీసీఐ కోరింది. అంతేకాక పంత్ క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు దుబాయ్ వెళ్లాడు. ఇక్కడ అతను మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి క్రిస్మస్ జరుపుకున్నాడు. ఆ తర్వాత, రిషబ్ పంత్ తిరిగి వచ్చి తన కారులో ఢిల్లీ నుంచి తన సొంత పట్టణం రూర్కీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 30 తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. 
Also Read: Balakrishna Helicopter: బాలయ్యకి తప్పిన పెను ప్రమాదం.. హెలికాఫ్టర్ ఎమర్జన్సీ లాండింగ్!


Also Read: Anjushree Parvathi death: బిర్యానీ తిని కేరళ యువతి మృతి.. ఐదు రోజుల్లో రెండో మరణం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook