Suresh Raina: దోపిడీ దొంగల దాడిలో సురేష్ రైనా బంధువు మృతి
ఐపీఎల్ 2020 ఆడకుండా క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) ఇంటికి తిరిగొచ్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ సీజన్లో రైనా సేవలు అందుబాటులో ఉండవు. అయితే తాజా మరో విషయం వెలుగుచూసింది. రైనా బంధువుల ఇంటిపై దోపిడీ దొంగలు దాడి చేశారు.
దోపిడి దొంగల దాడిలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) బంధువు గాయపడి మరణించాడు. అతడి కుటుంబసభ్యులు నలుగురు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు పది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైనా బంధువు అశోక్ కుమార్(58) పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా ధరియాల్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అశోక్ కుమార్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయిస్తుంటారు. Singer Karunya: సింగర్ కారుణ్య ఇంట విషాదం
Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ
కాంట్రాక్టర్ అశోక్ ఇంటిపై దోపిది దొంగల కన్ను పడింది. ఆగస్టు 19న అర్ధరాత్రి సమయంలో అశోక్ కుమార్‌పై కుటుంబసభ్యులపై దోపిడీ దొంగలు విచక్షణారహితంగా దాడి చేసి బంగారం, నగదు దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన అశోక్ కుమార్ చనిపోగా, ఆయన తల్లి సత్యదేవి, భార్య ఆశాదేవి, కుమారులు ఆపిన్, కౌశల్ గాయపడ్డారని పోలీసులు శనివారం వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు సూపరింటెండ్ పోలీస్ గుల్నీత్ సింగ్ తెలిపారు. Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత
కాగా, ఐపీఎల్ 2020 ఆడేందుకు యూఏఈకి వెళ్లిన రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో భారత్‌కు తిరిగొచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతో రైనా ఈ సీజన్ ఆడకుండానే ఇంటికి వెళ్లిపోతున్నాడని చెన్నై టీమ్ సీఈవో వెల్లడించడం తెలిసిందే. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి