Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ

నటి మీరా మిథున్ (Meera Mitun) రంజిత బాటలో నడిచేందుకు సిద్ధమైంది. తన దేశం కైలాస్ అని ప్రకటించుకున్న స్వామి నిత్యానంద (Swami Nithyananda)కు సేవలు చేసేందుకు సిద్ధమంటూ చెబుతోంది బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్. 

Last Updated : Aug 28, 2020, 04:27 PM IST
Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ

దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే వివాదాస్పద బాబా స్వామి నిత్యానంద (Swami Nithyananda). గతంలో నటి రంజితతో రాసలీలల వ్యవహారం వీడియోలు బయటకు రావడంతో చిక్కులో పడ్డాక కొంతకాలం కనుమరుగై ఆ తర్వాత మళ్లీ తన కార్యక్రమాలు మొదలుపెట్టాడు. కర్ణాటకలోని ఆశ్రమాల్లో దాదాపు 15 మందితో ఆయన రాసలీలు సాగించారని అభియోగాలున్నాయి. పలు ఆర్థిక పరమైన కేసులలోనూ నిందితుడిగా ఉన్న నిత్యానంద ఇటీవల రిపబ్లిక్ ఆఫ్ కైలాస్ అంటూ కొత్త దీవిని ఏర్పాటు చేసుకుని తన దేశం కైలాస్ అని ప్రకటించుకోవడం తెలిసిందే. Sunny Leone: ఎంట్రన్స్ టాపర్‌గా నటి సన్నీ లియోన్!

ఇంత జరిగినా సరే.. ఆయనకు ఫ్యాన్ అయిపోయాను.. నిత్యానంద సేవలో తరిస్తానంటోంది కోలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్ (Meera Mitun). తాను కచ్చితంగా నిత్యానంద క్రియేట్ చేసిన కొత్త ప్రపంచం రిపబ్లిక్ ఆఫ్ కైలాస్‌ను సందర్శిస్తానంటోంది. ఆయనను ఎంతగానో ద్వేషించారు, ఆరోపణలు చేశారు. మీడియా సైతం ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. కానీ ఇప్పుడు చూడండి.. స్వామి కైలాస అనే కొత్త దేశాన్ని క్రియేట్ చేశారు. లాట్స్ ఆఫ్ లవ్ అని ట్వీట్ చేసింది సంచలన నటి మీరా మిథున్. Movies On OTT: ‘జనవరి వరకు థియేటర్లకు నో ఛాన్స్’ 

ఇటీవల వరుస వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలతో తమిళ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్న మీరా మిథున్ ఎలాగైనా సరే తన స్వామి నిత్యానందను కలుసుకుని ఆయన సేవలో తరించాలని ఆరాటపడుతోంది. నెపోటిజం కారణంగానే సూర్య, విజయ్‌లు ఇండస్ట్రీలో ఎదిగారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీరా మిథున్ మరోవైపు.. హీరోయిన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే తాజాగా తన రూటు మార్చింది. నిత్యానంద రాసిన పుస్తకాలు చదువుతూ, ఆయనను ప్రశంసిస్తూ ఆయనపై తన ఆరాధనను వ్యక్తం చేస్తోంది. Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్

Trending News