టీమిండియాకు ఆడిన క్రికెటర్ వేణుగోపాలరావు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్‌తో తీయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "నాకు భారత క్రికెట్ జట్టు మంచి అనుభూతులను మిగిల్చింది. ఇప్పుడు నేను ఓ ఆదర్శప్రాయుడైన వ్యక్తితో కలిసి ముందుకు నడవాలని భావిస్తున్నాను. సమాజంలో మార్పుకు జనసేన లాంటి పార్టీ అవసరం" అని ఆయన ఫేస్ బుక్‌లో సందేశం కూడా ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వేణుగోపాలరావు తన కెరీర్‌లో 121 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 134 లిస్ట్ ఏ క్రికెట్ మ్యాచ్‌లు, 16 వన్డేలు, 83 టీ20లు ఆడారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్ జట్ల తరఫున కూడా ఆడారు. అదే విధంగా ఐపీఎల్ జట్లలో డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా మ్యాచ్‌లు ఆడారు. వేణుగోపాలరావు సోదరుడు జ్ఞానేశ్వర రావు కూడా పలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు, టీ20 మ్యాచ్‌లు ఆడారు. అలాగే ఐపీఎల్‌లో కూడా రాణించారు. 


ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో పలువురు క్రీడాకారులు కూడా చేరుతుండడం గమనార్హం. కామన్వెల్త్ స్వర్ణ పతాక క్రీడాకారుడు రాగల వెంకట రాహుల్‌ పతకం గెలిచినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూ.10 లక్షల రూపాయలను ఆయనకు రివార్డుగా ప్రకటించారు.