Yashasvi Jaiswal New Flat: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్ లో టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ అదరగొడుతున్నాడు. వైజాగ్, రాజ్ కోట్ టెస్టుల్లో డబుల్ సెంచరీలు బాదిన ఈ యువ బ్యాటర్.. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియా అయిన బాంద్రా ఈస్ట్‌లో ఫ్లాట్‌ కొన్నాడని తెలుస్తోంది. ఈ ఫ్లాట్‌ విలువ సుమారు రూ. 5.38 కోట్లుగా సమాచారం. బాంద్రా ఈస్ట్‌లో ఉన్న బీకేసీ ప్రాజెక్ట్‌లో సకల సదుపాయాలు ఉన్న ఈ ఫ్లాట్ ను గత నెలలో తన పేరిట రిజిష్ట్రేషన్‌ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను అదానీ రియాలిటీ నిర్మిస్తోంది. ఐదు ఎకరాలలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో సుమారు పది టవర్లు ఉన్నాయి. ఒక్కో అపార్ట్‌మెంట్‌ 22 అంతస్తుల ఎత్తు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది బాంద్రా రైల్వే స్టేషన్‌కు దగ్గరగా..ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు 8.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్ లోని సూర్యవాన్ అనే చిన్న గ్రామంలో యశస్వి జైస్వాల్ జన్మించాడు. ఇతని తండ్రి ఉపేంద్ర జైస్వాల్ చిన్న దుకాణం నడుపుకునే వారు. ఆయన భార్య కంచన్ జైస్వాల్ హౌస్ వైఫ్. వీరి నాల్గో సంతానమే యశస్వి జైస్వాల్. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో యశస్విని ముంబైలో తన తమ్ముడి దగ్గరికి జైస్వాల్ ను పంపించాడు ఉపేంద్ర. అక్కడే ఓ పక్క పానీపూరి అమ్ముకుంటూ.. మరోపక్క క్రికెట్ ప్రాక్టీషు చేసేవాడు. అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోని జాతీయ జట్టుకు ఆడే స్థాయికి ఎదిగాడు. అంతేకాకుండా తన బ్యాటింగ్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. మరో వీరూను గుర్తు చేస్తూ అతడు ఆడుతున్న ఆటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్ గానే తల్లిదండ్రులు కోసం జైస్వాల్‌ థానేలో 1500 స్క్వేర్‌ఫీట్‌లలో ఉన్న ఐదు బెడ్‌ రూమ్‌ల లగ్జరీ ఫ్లాట్‌కు మారిన సంగతి తెలిసిందే. తాజాగా అతడు బాంద్రా ఏరియాలో ఫ్లాట్ కొనుక్కోవడం వైరల్ గా మారింది. 


Also read: దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు.. కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు జైస్వాల్‌..


Also read: Anushka Baby Boy: 'బుల్లి విరాట్‌ కోహ్లీ' వచ్చేశాడు.. పుత్రోత్సాహంలో విరాట్‌ కోహ్లీ, అనుష్క.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook