Anushka Baby Boy: 'బుల్లి విరాట్‌ కోహ్లీ' వచ్చేశాడు.. పుత్రోత్సాహంలో విరాట్‌ కోహ్లీ, అనుష్క.

Anushka Sharma Blessed With Baby Boy: భారత అగ్ర క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రెండోసారి తండ్రయ్యాడు. గతంలో అనుష్క శర్మ పాపకు జన్మనివ్వగా.. తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విరుష్క జోడీ 'డబుల్‌ హ్యాపీ'లో మునిగారు. పుట్టిన బాబుకు పేరు కూడా పెట్టేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 20, 2024, 09:43 PM IST
Anushka Baby Boy: 'బుల్లి విరాట్‌ కోహ్లీ' వచ్చేశాడు.. పుత్రోత్సాహంలో విరాట్‌ కోహ్లీ, అనుష్క.

Virat Kohli Anushka Sharma Son Name Is Akaay: భారత దిగ్గజ క్రికెట్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. ముగ్గురు కాస్త నలుగురుగా మారారు. అనుష్క శర్మ తాజాగా మగబిడ్డకు జన్మనివ్వడంతో విరాట్‌ కోహ్లీ, అనుష్క అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బుల్లి కోహ్లీ పుట్టాడని ఆనందంలో మునిగితేలారు. కాగా బాబు పుట్టాడని.. పేరు కూడా పెట్టినట్లు విరుష్క జోడీ ప్రకటించింది. అయితే తమకు ప్రైవసీని అర్ధం చేసుకోవాలని.. ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read: IPL 2024 Schedule: ఐపీఎల్‌ ప్రారంభంపై స్పష్టత.. అప్పటి నుంచే మొదలవుతుందని చైర్మన్‌ ప్రకటన

'మా హృదయాలు ఎంతో ప్రేమ, ఆనందాలతో నిండిపోయాయి. ఫిబ్రవరి 15వ తేదీన బాబు పుట్టాడని మీ అందరితో పంచుకోవడానికి సంతోషిస్తున్నాం. ఈ ప్రపంచంలోకి వామిక చిట్టి తమ్ముడు అకాయ్‌ వచ్చాడు. మీ ఆశీస్సులు, అభిమానం మా జీవితంలో ఆనందాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మా ప్రైవసీని గౌరవించండి' అంటూ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పంచుకున్నారు.

Also Read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన

గత కొంతకాలంగా అనుష్క శర్మ మరోసారి గర్భం దాల్చారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు వాస్తవమయ్యాయి. బెంగళూరులో ఓ ఆస్పత్రికి అనుష్క, కోహ్లీ కలిసి వెళ్లినప్పుడే విరుష్క జోడీ రెండో సంతానానికి జన్మనివ్వబోతుందని తెలిసింది. తొలి సంతానంగా వామిక జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కలిగిన మగ సంతానానికి విరుష్క జోడీ 'అకాయ్‌' అని నామకరణం కూడా చేయడం విశేషం.

ఇద్దరు వేర్వేరు రంగాలైనా కోహ్లీ, అనుష్క కొన్నాళ్లు ప్రేమించుకుని అనంతరం 2017లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి అందమైన జంట సందడి చేస్తోంది. కోహ్లీ కోసం అనుష్క సినిమాలకు దూరంగా ఉంటోంది. వీరికి 11 జనవరి 2021లో వామిక జన్మించింది. కాగా భార్య ప్రసవం కోసమే విరాట్‌ కోహ్లీ ఇటీవల జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టులకు విరాట్‌ దూరమయ్యాడు. ఇప్పుడు మొత్తం సిరీస్‌కే కోహ్లీ ఆడడం లేదు. ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్న కోహ్లీ మరికొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. నేరుగా ఐపీఎల్‌లోనే కోహ్లీ కనిపిస్తాడని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x