Happy Birthday Cristiano Ronaldo: మనదేశంలో ఫుట్‌బాల్ గురించి పెద్దగా ఆసక్తి చూపరు కానీ ఆ ఆట గురించి తెలిసిన వారిని ఒక ఇద్దరు ఆటగాళ్ల పేర్లు చెప్పమంటే వారు చెప్పే రెండు పేర్లలో కచ్చితంగా ఉండే ఒక పేరు క్రిస్టియానో రొనాల్డో. ఈరోజు ఈ ఫుట్‌బాల్ స్టార్ పుట్టినరోజు కావడంతో ఆయన గురించి కొన్ని విషయాలు మీ కోసం తీసుకు వస్తున్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోర్చుగల్ ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా రొనాల్డో ప్రొఫెషనల్ విభాగంలో ప్రస్తుతం సెరీ A క్లబ్ జువెంటస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 1985 ఫిబ్రవరి 5న జన్మించిన రొనాల్డో స్పోర్టింగ్ సీపీ టీమ్ తరఫున ప్రొఫెషనల్ కెరీర్లో అరంగేట్రం చేశాడు. అనంతరం 2003లో మాంచెస్టర్ యునైటెడ్‌కు మారి 2003లోనే 18 సంవత్సరాల వయసులో పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించారు.


ఉత్తమ ఆటతీరుతో 2008లో జాతీయ జట్టు పగ్గాలు చేపట్టి దేశం తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 2016లో UEFA యూరోపియన్ ఛాంపియన్‌షిప్, 2019లో UEFA నేషనల్ లీగ్‌లో తన జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన గతంలో మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, ప్రస్తుతం జువెంటస్ జట్లలో రొనాల్డో కీ ప్లేయర్‌గా ఉండి దూసుకుపోతున్నాడు.


అంతేకాదు క్రిస్టియానో రొనాల్డో కెరీర్లో 1 బిలియన్ డాలర్లు సంపాదించిన మూడో స్పోర్ట్‌స్టార్‌గా నిలిచాడని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఫుట్‌బాల్ ఫీల్డ్‌లో, GOAT అంటే ఇప్పటి వరకు ఈ గేమ్‌లోని గొప్ప ఆటగాళ్ళలో ఒకరైన రోనాల్డోకి 490 మిలియన్ల అమెరికా డాలర్ల ఆస్తి ఉంది. రొనాల్డోకు అభిమానుల సంఖ్య భారీగానే ఉంది ఎందుకంటే ఒకటి రెండు దేశాలు అని కాదు ప్రపంచవ్యాప్తంగా అతని ఆటకు అభిమానులున్నారు. గ్రేట్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డోకు వాహనాలంటే చాలా ఇష్టం అందుకే ఆయన కార్లను కలెక్ట్ చేస్తూ ఉంటారు.


రొనాల్డో తన కెరీర్‌లో ఐదుసార్లు బాలన్ డి'ఓర్‌ను గెలుచుకున్నాడు. ఆయన 2008, 2013, 2014, 2016 మరియు 2017లలో బాలన్ డి'ఓర్ గెలుచుకున్నాడు. ఇటీవల, 2016-17 సీజన్‌లో, రొనాల్డో రియల్ మాడ్రిడ్ తరపున లాలిగా మరియు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాడు. రొనాల్డో నాయకత్వంలో పోర్చుగల్ తొలిసారి యూరో ఛాంపియన్‌షిప్‌ను సైతం గెలుచుకుంది. పారిస్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌ జట్టుపై విజయం సాధించిన పరంగి పాద తొలిసారి యూరోపియన్‌ ఛాంపియన్‌గా అవతరించింది. దురదృష్టవశాత్తు గాయం కారణంగా రొనాల్డో ఫైనల్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక ఒక రకంగా  2016లో యూరో కప్ గెలిచిన తర్వాత, రొనాల్డో నాయకత్వంలో, పోర్చుగల్ మొదటి నేషన్స్ లీగ్‌ను గెలుచుకుంది.


Also Read: Pervez Musharraf: గంగూలీకి ముషారఫ్ ఫోన్.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వార్నింగ్


Also Read: India Vs Australia: అశ్విన్ పేరు వింటేనే ఆసీస్‌కు దడ.. కంగారూల భయానికి కారణం ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.