India Vs Australia: అశ్విన్ పేరు వింటేనే ఆసీస్‌కు దడ.. కంగారూల భయానికి కారణం ఇదే..!

Ravichandran Ashwin Records Against Australia: రవిచంద్రన్ అశ్విన్‌ పేరు చెబితేనే కంగారు జట్టు వెన్నులో వణుకు మొదలవుతుంది. భారత పిచ్‌లపై అశ్విన్‌ను ఎదుర్కొవడం ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్‌కు అయినా సవాలే. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ జట్టు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకుని వస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 05:48 PM IST
India Vs Australia: అశ్విన్ పేరు వింటేనే ఆసీస్‌కు దడ.. కంగారూల భయానికి కారణం ఇదే..!

Ravichandran Ashwin Records Against Australia: టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే.. కంగారు శిబిరంలో ఎక్కువగా ఓ బౌలర్ గురించి చర్చ జరుగుతోంది. ఈ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఓ నెట్‌ బౌలర్‌ను ఎంపిక చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు ఆసీస్ ఆటగాళ్లు. ఆ డేంజరస్ బౌలరే ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా తర్వాత ఆలూరులో అశ్విన్‌ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు కంగారూ జట్టు కూడా అతనిలాంటి యాక్షన్‌ బౌలర్‌ మహేశ్‌ పిథియా ముందు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్‌ చేసింది.

భారత పరిస్థితుల్లో రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కొవడం ఏ జట్టుకైనా సవాలే.  గత దశాబ్దంలో అన్ని జట్లు అశ్విన్‌ బౌలింగ్‌లో తీవ్ర ఇబ్బంది పడ్డాయి. ఇందులో  ఆస్ట్రేలియా జట్టు ముందుంది. 2017లో ఆస్ట్రేలియా జట్టు చివరిసారిగా భారత్‌లో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు.. అశ్విన్ 4 మ్యాచ్‌ల్లో 27.38 సగటుతో మొత్తం 21 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు కంగారూ జట్టుతో 18 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. 31.48 సగటుతో మొత్తం 89 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆసీస్ ప్లేయర్లు కసరత్తు చేస్తున్నారు. 

కంగారూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌పై చాలా ఆధారపడి ఉంటుంది. ఈ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తే.. టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ జట్టు గట్టి పోటీ ఇస్తుంది.  అయితే రవిచంద్రన్ అశ్విన్‌పై స్మిత్‌, వార్నర్‌ల రికార్డు మెరుగ్గా లేకపోవడం ఆ జట్టును కంగారు పెడుతోంది. స్మిత్ ఇప్పటివరకు 6 సార్లు అశ్విన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక డేవిడ్ వార్నర్ ఏకంగా అశ్విన్ బంతులకు 10 సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. లబుషెన్, ఉస్మాన్ ఖవాజా కూడా అశ్విన్ బౌలింగ్‌లో రెండుసార్లు పెవిలియన్ బాటపట్టారు. 

ప్రస్తుతం భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే తర్వాత అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ 88 టెస్ట్ మ్యాచ్‌లలో 24.3 సగటుతో మొత్తం 449 వికెట్లు తీశాడు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో 30 సార్లు 5 వికెట్లు తీశాడు. బౌలింగ్‌లోనే కాకుండా లోయర్ ఆర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మెన్. ఇప్పటివరకు 3043 పరుగులు చేయగా.. ఇందులో 5 సెంచరీలు కూడా బాదాడు. అశ్విన్ అత్యుత్తమ స్కోరు 124. రవిచంద్రన్ అశ్విన్ 113 వన్డేల్లో 151 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ వన్డేల్లో 707 పరుగులు, టీ20ల్లో 184 పరుగులు చేశాడు. 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్ 157 వికెట్లు పడగొట్టి 647 పరుగులు చేశాడు.

Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి   

Also Read: నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. మంత్రి అమర్‌నాథ్‌కు హరిరామజోగయ్య లేఖ.. వెంటనే స్ట్రాంగ్ రిప్లై  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News