MS Dhoni: బస్సు డ్రైవర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మరీ దూసుకెళ్లాడు (వీడియో)!!
MS Dhoni becomes a RTC bus driver: ఐపీఎల్ 2022 ప్రోమో వచ్చేసింది. గతేడాది మాదిరే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. బస్సు డ్రైవర్‌గా మారిన మహీ అందరినీ అలరించాడు.
MS Dhoni becomes a RTC bus driver for IPL 2022 Promo: ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ కనుసన్నల్లో నడుస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎన్నో లీగ్‌లు వచ్చినా.. ఐపీఎల్ తప్ప మిగతావేవీ అంతగా సక్సెస్ కాలేదు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు ప్రతి ఏడాది ఆదరణ పెరుగుతూ పోతుంది. చాలా దేశాల్లో ఐపీఎల్ లీగ్‌కి భారీ సంఖ్యలో ఫాన్స్ ఉన్నారు. అందుకే ఐపీఎల్ బ్రాండ్ విలువ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.
మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 ఆరంభం కానుంది. మరో రెండు, మూడు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే నిర్వాహకులు వినూత్నంగా ప్రమోషన్స్ ఆరంభించారు. గతేడాది మాదిరే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఐపీఎల్ 2021 రెండో దశ కోసం ఇంటింటికి తిరిగి సందడి చేసిన మహీ.. ఈసారి బస్సు డ్రైవర్‌గా అలరించాడు. సౌత్ ఇండియన్ లుక్‌లో కనిపించి ఔరా అనిపించాడు. గతంలో కంటే కూడా ఈసారి ఐపీఎల్ ప్రోమో చాలా బాగుంది.
వీడియోలో ఎంఎస్ ధోనీ బస్సు నడుపుకొంటూ వెళ్తుండగా.. ఓ షాప్‌లో ఐపీఎల్ మ్యాచ్ లైవ్ వస్తుంటుంది. అది చూసిన ధోనీ బస్సును వెంటనే వెనక్కి తీసుకెళ్లి ఆపేస్తాడు. ఆపై బస్సులో ఉన్న ప్రయాణికులకు ఐపీఎల్ మ్యాచ్ చూడమని చెప్తాడు. బస్సు నిలిపివేయడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంతో ప్రజలు అందరూ గోల చేస్తారు. ఇది చుసిన ఓ ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇక్కడ ఏం జరుగుతోంది అని ప్రశ్నించగా.. 'సూపర్ ఓవర్ నడుస్తోంది' అంటూ మహీ తన స్టైల్‌లో మైక్ పెట్టి మరీ బదులిస్తాడు. దీంతో ట్రాఫిక్ పోలీస్ 'ఒకే తలైవా' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఎంఎస్ ధోనీ బస్సు డ్రైవర్‌గా మారిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోనీ ఖాకీ రంగు దుస్తుల్లో బలే ఉన్నాడు. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'తలైవా సూపర్', 'మహీ ఇరగదీశాడు', 'ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మరీ మ్యాచ్ చూస్తున్నాడు' అంటూ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతేడాది చెన్నై టైటిల్ కొట్టిన విషయం తెలిసిందే. దాంతో నాలుగోసారి మహీ చెన్నైకి కప్ అందించాడు. ఈసారి కూడా చెన్నై జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాడ్‌కి ప్రముఖ దర్శకుడు వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు షీ టీమ్స్ 2కె, 5కె రన్.. అమలులోకి ట్రాఫిక్ ఆంక్షలు
Also Read: Hindi Talent Test: హిందీ టాలెంట్ టెస్టులో సత్తా చాటిన కోరుట్ల విద్యార్థినులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook