కీలక ఆటగాళ్లు లేకుండానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తొలి మ్యాచ్‌లో సత్తా చాటింది. డిఫెండింగ్ ఛాంపియన్, పటిష్ట ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి ఊపు మీదుంది. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కరోనా నుంచి కోలుకున్నాడు. సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో దర్శనమిచ్చాడు. ఎవరు తిరిగొచ్చారో చూడండి అంటూ ఈ మేరకు సీఎస్కే తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుబాయ్ వచ్చిన తర్వాత 11 మంది సహాయక సిబ్బందితో పాటు దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్‌లు కరోనా బారిన పడటం తెలిసిందే. వారం రోజుల కిందటే దీపక్ చాహర్ కోలుకున్నా, రుతురాజ్ రెండు రోజుల కిందటి వరకు కరోనాతో బాధపడ్డాడు. తాజాగా సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాట్ చేతబట్టి కనిపించడంతో సీఎస్కే అభిమానులు ఖుషీ అవుతున్నారు. 




అసలే సురేశ్ రైనా లాంటి కీలక ఆటగాడు ఈ సీజన్ లో చెన్నై జట్టుకు దూరం కావడంతో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మీద సీఎస్కే భారం పడింది. జట్టు అవసరాల కోసం టాపార్డర్, మిడిలార్డర్‌లో రుతురాజ్ బ్యాటింగ్ చేయగలడు. దుబాయ్‌లో అంతగా ప్రాక్టీస్ చేయని రుతురాజ్‌ త్వరగానే ఫామ్ లోకి వస్తాడా.. లేక పిచ్ అర్థం చేసుకునేందుకు టైమ్ తీసుకుంటాడా అనేది నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్‌లో తేలనుంది. ధోనీ మార్క్ పంచ్ పేలింది.. Dhoni Is Back అంటున్న ఫ్యాన్స్  


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe