CSK in IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌కి భారీ ఊరట
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ( CSK players ) గుడ్ న్యూస్. గత వారం కరోనాతో పాటు వివిధ ఇతర సమస్యలతో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తాజాగా జరిగిన కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) భారీ ఊరట లభించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ( CSK players ) గుడ్ న్యూస్. గత వారం కరోనాతో పాటు వివిధ ఇతర సమస్యలతో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తాజాగా జరిగిన కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) భారీ ఊరట లభించింది. జట్టుకు చెందిన ఆటగాళ్లతో పాటు సిబ్బందికి అందరికీ కరోనా పరీక్షల్లో ఫలితం నెగటివ్ అని వచ్చింది. ఇదివరకు ఇదే జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లతో పాటు పలువురు ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికితోడు ఆ తర్వాతే వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా ( Suresh Raina ) జట్టు నుంచి నిష్క్రమించడం వంటి పరిణామాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. Also read : Sourav Ganguly: టీవీ రేటింగ్స్ అద్దిరిపోతాయ్: సౌరవ్ గంగూలీ
IPL 2020 టోర్నమెంట్ ప్రారంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ( Chennai Super Kings ) ఎదురవుతున్న సవాళ్లు చూసి జట్టు ఆటగాళ్లే కాకుండా అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. టోర్నమెంట్‌లో ఫ్రాంచైజీ భవిష్యత్ ఎలా ఉండనుందోనని అయోమయానికి గురయ్యారు. కానీ తాజాగా జట్టు ఆటగాళ్లు, సిబ్బంది అందరికీ కరోనా పరీక్షల్లో నెగటివ్ రావడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. Also read : COVID19 Tests: ఐపీఎల్ ఆటగాళ్ల కోవిడ్ టెస్టులకు భారీగా ఖర్చు
ఐతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జట్టు ఆటగాళ్ల కష్టాలు ఇంతటితో తీరిపోలేదు. సెప్టెంబర్ 3న మరోసారి కరోనా పరీక్షలు ( Coronavirus tests ) నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగటివ్ అని తేలితే.. అప్పుడే వారిని ఐపిఎల్ ట్రైనింగ్‌కి అనుమతించనున్నారు. ఇక ఇదివరకు కరోనా సోకిన ఇద్దరు ఆటగాళ్లను సెప్టెంబర్ 12 వరకు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. Also read : CSK ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా భయం
సీఎస్కే ఫ్రాంచైజీ ఆటగాళ్లయిన సౌతాఫ్రికా ప్లేయర్స్ డూప్లెసిస్ ( Faf du Plessis ), ఎంగిడి ( Lungisani Ngidi ) కూడా సోమవారమే అబు ధాబి చేరుకుని జట్టు సభ్యులను కలుసుకున్నారు. వచ్చి రావడంతోనే వారిని కూడా నేరుగా క్వారంటైన్‌లో ఉండేలా ఐపిఎల్ 2020 నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. సీఎస్‌కే జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ( MS Dhoni ) ఈ సీజన్ ఆరంభంలోనే సవాళ్లు ఎదురయ్యేలా చేసింది. Also read : ‘Sourav Ganguly టీ20లకు పనికిరాడని ముందే ఊహించా’