MS Dhoni became first batter scores 2500 runs in death overs in IPL: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాట్‌తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతిసారి బౌండరీల మోత మోగిస్తూ జట్టుకు విలువైన పరుగులు జోడిస్తునాడు. 15వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన ధోనీ.. ఆ తర్వాత అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ 2022లో 11 మ్యాచులు ఆడిన ధోనీ.. 163 రన్స్ చేశాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో తనదైన శైలిలో ఆడి.. తనలోని ఫినిషర్ ఇంకా సజీవంగానే ఉన్నాడని చాటి చెప్పాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ చెలరేగాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్ వచ్చిన ధోనీ.. 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌ ఉన్నాయి. మహీ ధాటికి చెన్నై జట్టు స్కోర్‌ను 200 దాటింది. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో చెన్నై కెప్టెన్ ఓ అరుదైన రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా మహీ రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. 


ఈ మ్యాచ్ ద్వారా ఎంఎస్ ధోనీ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. టీ20ల్లో కెప్టెన్‌గా 6వేల పరుగుల మైలురాయిని మహీ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు 6వేల పరుగులకు 6 పరుగుల దూరంలో నిలిచిన మహీ..  21 రన్స్ బాదడంతో ఆ రికార్డు అధిగమించాడు. మొత్తంగా కెప్టెన్‌గా 185 ఇన్నింగ్స్‌లో 5994 పరుగులు చేశాడు. ధోనీ కన్నా ముందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే కెప్టెన్‌గా 6వేల పరుగులు చేశాడు. 


ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (87; 49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ (41; 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), శివమ్ దూబే (32; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్‌ మార్ష్‌ (25), శార్దుల్‌ ఠాకూర్‌ (24) మినహా ఎవరూ రాణించలేదు. 


Also Read: Jagadeesha Suchith Record: జగదీశ సుచిత్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో స్పిన్నర్‌గా..!


Also Read: Sarkaru Vaari Paata: మహేష్ 'సర్కారు వారి పాట' జోరు... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook