Jagadeesha Suchith became third spinner to take a wicket of the first delivery in an IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ జగదీశ సుచిత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. బెంగళూరు ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ విరాట్ కోహ్లీని సుచిత్ ఔట్ (గోల్డెన్ డకౌట్) చేశాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన మూడో స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు.
అంతకుముందు ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్, విండీస్ స్పిన్నర్ మార్లన్ సామ్యూల్స్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ పడగొట్టారు. 2009లో పీటర్సన్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయగా.. 2012లో సామ్యూల్స్ పడగొట్టాడు. 2022లో జగదీశ సుచిత్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి.. ఐపీఎల్ చరిత్రలో మూడో స్పిన్నర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ మ్యాచులో శ్రేయస్ గోపాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సుచిత్.. నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో గోల్డెన్ డకౌట్ కావడం ఇది ఆరోసారి. ఇందులో మూడు గోల్డెన్ డకౌట్‌లు ఐపీఎల్ 2022 సీజన్‌లోనే అయ్యాడు. 2008లో కోహ్లీ మొదటిసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 2014లో, 2017లో కూడా కోహ్లీ గోల్డెన్ డకౌట్‌లుగా వెనుదిరిగాడు. ఇక 2022లో ఏకంగా మూడుసార్లు గోల్డెన్ డకౌట్‌లు అయ్యాడు. ఈ ఏడాది కోహ్లీ ఫామ్‌లో లేని విషయం తెలిసిందే.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 స్కోరు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (50 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. రజత్ పాటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33) అతడికి అండగా నిలిచారు. ఇన్నింగ్స్ చివరలో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) చెలరేగాడు. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్ త్రిపాఠి (37 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. హసరంగ డిసిల్వా (5/18) సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు.
Also Read: Horoscope Today May 9 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు...
Also Read: Saroor Nagar Honour Killing: సరూర్ నగర్ పరువు హత్య... రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook