Liam Livingstone 60 Runs Helps Punjab Kings set 181 runs to Chennai Super Kings: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసి.. చెన్నై ముందు 181 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (60) హాఫ్ సెంచరీ చేయగా.. శిఖర్‌ ధావన్‌ (33), జితేష్‌ శర్మ (26) రాణించారు. చెన్నై బౌలర్లలో డ్వైన్ ప్రిటోరియస్, క్రిస్‌ జోర్డాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ చౌదరి, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్‌కి వచ్చిన పంజాబ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.  తొలి ఓవర్లలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (2) ఔట్ కాగా.. రెండో ఓవర్లో భానుక రాజపక్స (5) పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్.. ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు కలిసి 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శిఖర్ ధావన్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు.



లియామ్ లివింగ్‌స్టోన్ 32 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 60 పరుగులు చేసి.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. లివింగ్‌స్టోన్ పెవిలియన్ చేరిన అనంతరం పంజాబ్ ఇన్నింగ్స్ అంత సాఫీగా సాగలేదు. జితేశ్ శర్మ (26), షారూఖ్ ఖాన్ (6), ఓడియన్ స్మిత్ (3), రాహుల్ చహర్ (12), కాగిసో రబడ (12) వైభవ్ అరోరా (1) నిరాశపరిచారు. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్ చెరో రెండు వికెట్లు తీశారు. ముఖేష్ చౌదరి నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 13 ఎకానమీతో 52 పరుగులు సమర్పించుకున్నాడు. 


Also Read: Alyssa Healy: అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య! ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ టోర్నీ అవార్డులు అందుకున్న భార్యభర్తలు వీరే!


Also Read: RRR Movie: ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్ షో.. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook