RRR Movie: ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్ షో.. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్..!!

Jr NTR's reaction after watching RRR Movie. ఆర్ఆర్ఆర్ సినిమా స్పెషల్ షో చూసాక హీరో ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఏఎంబీ మాల్‌ నుంచి బయటకి వస్తూ.. చిరునవ్వు చిందించారు. డబుల్ థంబ్స్ అప్ చూపిస్తూ.. బాగుందని చెప్పారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 08:57 AM IST
  • ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌
  • ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్ షో
  • సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్
RRR Movie: ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్ షో.. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్..!!

Jr NTR's reaction after watching RRR Movie at AMB Cinemas: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈరోజు (మార్చి 25) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. చాలా చోట్ల ఇప్పటికే స్పెషల్, బెనిఫిట్‌ షోలు పడ్డాయి. దాంతో థియేటర్స్‌లో అభిమానులు నానా గోల చేస్తున్నారు. ఈలలు, కేకలు పెడుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయమే ఆర్ఆర్ఆర్ సినిమాను అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా చూసింది. 

ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఐదు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్‌ షోలు పూర్తయ్యాయి. ఏఎంబీ మాల్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యేక షో వేశారు. ఈ షోకి జూనియర్ ఎన్టీఆర్ సహా అతడి భార్య లక్ష్మీ ప్రణతి.. పిల్లలు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌ హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ స్పెషల్ షోకి హాజరయ్యారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారని సమాచారం. 

ఆర్ఆర్ఆర్ సినిమా స్పెషల్ షో చూసాక హీరో ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఏఎంబీ మాల్‌ నుంచి బయటకి వస్తూ.. చిరునవ్వు చిందించారు. డబుల్ థంబ్స్ అప్ చూపిస్తూ.. బాగుందని చెప్పారు. సినిమా చాలా చాలా బాగుందని సింబాలిక్‌గా చెప్పారు. దాంతో ఫాన్స్ అరుపులు మొదలెట్టారు. ఎన్టీఆర్ అన్నా, ఏపీ సీఎం అంటూ ఫాన్స్ అరిచారు. చివరకు ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి కారు ఎక్కి వెళ్లిపోయారు. మరోవైపు భ్రమరాంబ థియేటర్‌లో రామ్‌చరణ్‌ దంపతులు సందడి చేశారు. డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళితో సహా చిత్ర యూనిట్ కూడా భ్రమరాంబలో సినిమా చూశారు. 

Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లపై వారి పేర్లు.. గొడవకు దిగిన మెగా, నందమూరి ఫాన్స్! టికెట్స్ చించేస్తూ..!!

Also Read: Viral video: ఇంత క్రేజీ కాంబినేషన్ వంటకం ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండరు.. వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News