Dale Steyn: టీమిండియాకు బౌలింగ్​ కోచ్​గా ఉండేందుకు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్(Steyn News) ఆసక్తి కనబరిచాడు. ఓ క్రీడాఛానల్​ చేసిన ఇన్​స్టా పోస్ట్​కు స్టెయిన్ రిప్లై ఇచ్చిన తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. 93 టెస్టులు ఆడిన స్టెయిన్ 439 వికెట్ల్ తీశాడు. 125 వన్డేల్లో 196 వికెట్ల పడగొట్టాడు. 47 టీ 20ల్లో 64 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 26 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో మూడుసార్లు ఐదు వికెట్లు తీశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ నేపథ్యంలో టీమిండియాకు మెంటార్​గా ధోనీని(Dhoni Mentor) నియమించింది బీసీసీఐ. ఈ క్రమంలో.. 'ధోనీ(Dhoni)తో ఫోన్​ కాల్​లో ఉంటే.. ఆయనకు మీరు ఏం చెబుతారు?' అని సదరు ఛానల్​ ఓ పోస్ట్​ పెట్టింది. దీనికి బదులిచ్చిన డేల్ స్టెయిన్. 'టీమ్​ఇండియా బౌలింగ్​ కోచ్​గా నన్ను నియమించమని అడుగుతా' అని కామెంట్ చేశాడు. స్టెయిన్ (Dale Steyn)కామెంట్ చేసిన కొద్ది సేపటికే ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. టీమిండియా బౌలింగ్​ కోచ్​గా అతడిని నియమిస్తే బాగుంటుందని చాలా మంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.


Also read: T20 World Cup 2021: 'విరాట్ కోహ్లీ కోసం కప్ గెలవండి': సురేష్ రైనా


భారత పురుషుల జట్టుకు కొత్త కోచింగ్​ బృందం కోసం నేటి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. అయితే టీమిండియా కోచ్ బాధ్యతలు రాహుల్ ద్రవిడ్​(Dravid New Coach) చేపట్టనున్నాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి. పరాస్​ మాంబ్రే(Paras Mhambrey cricket) బౌలింగ్​ కోచ్​ పదవి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. టీ20 ప్రపంచకప్​ అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు రవిశాస్త్రి ఇటీవలే పేర్కొన్నాడు. మెగా టోర్నీ తర్వాత బౌలింగ్​ కోచ్​ బాధ్యతలు కొనసాగించనని భరత్ అరుణ్​ కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కొత్త కోచింగ్​ బృందం కోసం ప్రస్తుతం బోర్డు చర్చలు జరుపుతోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి