ICC 20 World Cup 2021: నేటి నుంచి టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2021) క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా(India)కు ఓ మెసేజ్ ఇచ్చాడు భారత మాజీ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా(Suresh Raina). యూఏఈ(UAE) వేదికగా అక్టోబర్ 24 న దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)పై భారత్ తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ప్లేయర్స్ సమిష్టిగా రాణించి సారథి కోహ్లీకి(Virat Kohli News) ట్రోఫీని అందించాలని సూచించాడు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు రైనా.
''ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి మేటి జట్లు ఉన్నాయన్న విషయం టీమ్ఇండియా మార్చిపోకూడదు(Suresh Raina on Virat Kohli). టీ20 క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. టాప్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. మంచి ఆరంభం ఇవ్వాలి. ఈ ముగ్గురూ నిలకడగా రాణిస్తే జట్టు విజయం తథ్యం. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య కూడా మంచి హిట్టర్లే." -సురేష్ రైనా.
Also read: Watch: బౌండరీ లైన్ వద్ద మునివేళ్లతో అద్భుతమైన క్యాచ్...ఫిదా అవుతున్న నెటిజన్స్!
ఈ టోర్నీలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బాగా ఆడగలడని రైనా అభిప్రాయపడ్డాడు రైనా. టీమ్‌లో శార్దూల్ రాకతో జట్టుకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఓపెనర్ బ్యాట్స్‌మన్ రుత్‌రాజ్ గైక్వాడ్‌ను ప్రశంసించాడు రైనా. "టీమ్ఇండియా జట్టులో ఆడేందుకు రుత్‌రాజ్ సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్లో అతడు ఆడిన తీరు హర్షనీయం. అతడు కూడా ధోనీ భాయ్లానే కూల్‌గా ఉంటాడు." అని కితాబిచ్చాడు.ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR)ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో నాలుగు సార్లు కప్ సాధించిన టీమ్‌గా నిలిచింది. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్(orange Cup)ను సొంతం చేసుకున్నాడు రుతురాజ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి