Danish Kaneria picks Team India second opener for Asia Cup 2022: ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. మరో 15 రోజుల్లో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఆగస్టు 28న దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ ఢీ కొట్టనున్నాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండడంతో ఇండో-పాక్ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ఇరు జట్లకు పలు సలహాలు, సూచలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా టీమిండియాకు విలువైన సలహా ఇచ్చాడు. ఆసియా కప్ 2022లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడించవద్దని సూచించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెస్టిండీస్ పర్యటనలో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్‌నే రోహిత్‌ శర్మతో ఓపెనర్‌గా ఆడించాలని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. 'ఆసియా కప్‌ 2022లో రోహిత్‌ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వస్తే బాగుంటుంది. విండీస్‌ పర్యటనలో రోహిత్‌‌తో కలిసి సూర్య మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చినా.. అతడు మిడిలార్డర్‌లో ఆడితే బాగుంటుంది. రాహుల్‌ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసి పరుగులు చేస్తాడు. గతంలో చాలా సార్లు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడు. కాబట్టి రోహిత్‌తో కలిసి సూర్య టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభించాలి అని కనేరియా తన యూట్యూబ్ చానెల్లో అభిప్రాయపడ్డాడు.


టీ20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా రావడమే. ఈ ఇద్దరి బ్యాటింగ్ శైలి ఒకేలా ఉండడమే అందుకు కారణం. క్రీజులో కుదురుకున్నాక కానీ.. ఇద్దరు అటాకింగ్ గేమ్ ఆడరు. ఇన్నింగ్స్‌ను రోహిత్ నెమ్మదిగా ప్రారంభించి.. క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడుతాడు. రాహుల్ కూడా ఇలానే ఆడతాడు. దాంతో ఇన్నింగ్స్‌ ఆరంభంలో పరుగులు రాక.. ఒత్తిడి గురై ఒకరు నెమ్మదిగా ఔట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా సలహా టీమిండియాకు లాభించేలా ఉంది. 


ఆసియా కప్‌కు భారత జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, అవేష్ ఖాన్. 


Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.6799 ధరకే ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్ 6 HD ఫోన్‌! 5000mAh బ్యాటరీ


Also Read: Diabetes Diet: మధుమేహం ఉన్నావారు కూడా ఈ తీపి పదార్థాలను తినొచ్చు.. ఇవి కూడా డయాబెటిస్‌కు చెక్‌ పెడుతాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook