Infinix Smart 6 HD smart phone buy only Rs 6799 in Flipkart: మొబైల్ తయారీదారు సంస్థ 'ఇన్ఫినిక్స్' (Infinix) భారత దేశంలో 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ (Infinix Smart 6 HD) మొబైల్ లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ నుంచి తక్కువ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. రూ. 9వేల రేంజ్‌లో మరో ఆప్షన్‌గా ఈ ఫోన్ అడుగుపెట్టింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్, ఫీచర్లు గురించి ఓసారి తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో 24 శాతం ఆఫర్:
ఫ్లిప్‌కార్ట్‌లో 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ' (Origin Blue, 32 GB, 2 GB RAM) స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,999లుగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 24 శాతం ఆఫర్ ఉంది. దాంతో రూ. 2200 తగ్గింపుతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్ రూ.6799 ధరకే సొంతమవనుంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నవారికి ఫ్లిప్‌కార్ట్ ఆక్సిస్ బ్యాంకు కార్డ్ ఆఫర్ ఉంది. ఇందులో 5 శాతం ఆఫర్ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‌కు వస్తుంది. ఆక్వా స్కై, ఫోర్స్ బ్లాక్, ఒరిజిన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
ఎక్స్ ఛేంజ్ ఆఫర్:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీని కేవలం రూ. 549కే ఇంటికి తీసుకుపోవచ్చు. అదెలాగంటే.. ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద రూ. 6,799 వరకు వస్తుంది. అయితే పాత స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ బాగుండాలి. అలాగే ఎలాంటి ఫిజికల్ డామేజ్ కూడా ఉండకూడదు. అన్ని బాగున్న పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ. 6,799 వస్తే.. అప్పుడు 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ' స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 549కే మీ సొంతమవుతుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ ఫీచర్లు ఇవే:
# 6.6 ఇంచుల హెచ్‌డీ + డిస్‌ప్లే
# 12nm మీడియాటెక్ డైమన్సిటీ ఏ22 ప్రాసెసర్
# 8MP ప్రైమరీ కెమెరా
# 5MP ఫ్రంట్ కెమెరా
# 5,000mAh బ్యాటరీ
# మైక్రో USB పోర్ట్
# డ్యూయల్ సిమ్
# ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ ఐడీ
Also Read: Jagan Govt: రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ట్యాక్స్.. జగన్ సర్కార్ మరో బాదుడు..
Also Read: Shivamogga Subbanna dies: ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook