David Warner Test Career: ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ బాంబు పేల్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు షాకింగ్ న్యూస్ చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. జూన్ 7వ తేదీ నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్నర్ నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియన్ సమ్మర్ చివరిలో టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మేరకు సమాచారాన్ని షేర్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో వార్నర్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడునున్నాడు. భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్, తరువాత ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌ జరగనుంది. 2024 జనవరిలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సమయంలోనే వార్నర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న వార్నర్.. భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత జూన్ 16 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌లో వార్నర్ బరిలోకి దిగనున్నాడు.


వార్నర్ ఇటీవల టెస్టుల్లో రిటైర్మెంట్ గురించి మాట్లాడినట్లు ఐసీసీ వెబ్‌సైట్ వెల్లడించింది. జనవరి 2024లో పాకిస్థాన్‌తో జరిగే సిడ్నీ టెస్టులో వార్నర్ రిటైర్ అవుతాడని పేర్కొంది. తన సొంత గడ్డపై వార్నర్ చివరి టెస్ట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. పాక్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌తో ఆసీస్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా ఆడే అవకాశం ఉంది. అయితే ఈ టెస్ట్ సిరీస్‌కు తాను దూరంగా ఉండాలనుకుంటున్నాని వార్నర్ తెలిపాడు. వెస్టిండీస్, యూఎస్‌ఏలలో జరిగే 2024 టీ20 ప్రపంచ కప్ వరకు ఆస్ట్రేలియా తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు.


"నేను 2024 ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నాను. ఇది నా మనసులో మెదులుతున్న విషయం. అంతకుముందు మాకు చాలా క్రికెట్ ఉంది. ఫిబ్రవరి నుంచి మ్యాచ్‌లు కాస్త తగ్గుతాయని నేను భావిస్తున్నాను. నా విషయానికొస్తే.. నేను ఐపీఎల్‌తోపాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్‌లను ఆడాలి. మళ్లీ ఆపై జూన్‌లో క్రికెట్ ఆడేందుకు రెడీ అవ్వాలని" అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు.


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. కీపర్‌గా కేఎస్ భరత్‌కు నో ఛాన్స్! భారత్ తుది జట్టు ఇదే  


ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన డేవిడ్ వార్నర్.. 8158 పరుగులు చేశాడు. 25 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు. వార్నర్ అత్యధిక స్కోరు 335. భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్‌తో సహా అనేక పెద్ద జట్లపై వార్నర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం వార్నర్ టెస్ట్ కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోయింది.  


Also Read: Odisha Train Accident Latest Updates: రైలు ప్రమాదంలో మరణించిన వారికి 35 పైసల బీమా వర్తిస్తుందా..? ఎంత డబ్బు వస్తుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి