WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. కీపర్‌గా కేఎస్ భరత్‌కు నో ఛాన్స్! భారత్ తుది జట్టు ఇదే

Mohammad Kaif India Playing 11 for WTC Final 2023. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 తుది జట్టులో వికెట్‌ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు మహ్మద్ కైఫ్.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 3, 2023, 05:11 PM IST
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. కీపర్‌గా కేఎస్ భరత్‌కు నో ఛాన్స్! భారత్ తుది జట్టు ఇదే

Mohammad Kaif India Playing 11 for WTC Final 2023: ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2023కి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 2023 డబ్ల్యూటీసీ టైటిల్ కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7-11 మధ్య ఫైనల్‌ పోరు జరగనుంది. గత టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా.. ఈసారి కప్ సాధించాలని చూస్తోంది. మరోవైపు మొదటిసారి 
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ కూడా ట్రోఫీ పట్టేయాలని భావిస్తోంది.  

డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 నేపథ్యంలో మాజీలు అందరూ తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తుది జట్టులో ఎవరెవరిని తీసుకోవాలో సూచనలు ఇస్తునారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ తమ అభిప్రాయాలను పంచుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 తుది జట్టులో వికెట్‌ కీపర్‌గా తెలుగు ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ కంటే ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు. కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లా మెరుపులు మెరిపించే ఆటగాడు కావాలని కైఫ్‌ పేర్కొన్నాడు. ఆరో స్థానంలో ఇషాన్ బాగా సరిపోతాడన్నాడు. 

ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్‌ శర్మ రావాలని మహ్మద్ కైఫ్ తెలిపాడు. మూడో స్థానంలో చేటేశ్వర్ పుజారా.. 4, 5 స్థానాల్లో విరాట్ కోహ్లీ, అజింక్య రహానే రావాలని సూచించాడు. ఆరో స్థానంలో హిట్టింగ్‌ చేసే ఆటగాడు కావాలని, శ్రీకర్ భరత్‌ కంటే కిషన్‌ కిషన్‌కు అవకాశం ఇస్తే మంచిదన్నాడు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజాకు, ఎనిమిదో స్థానంలో పిచ్ పరిస్థితులను బట్టి ఆర్ అశ్విన్ లేదా శార్దూల్‌ ఠకూర్‌కి  అవకాశం ఇవ్వాలని కైఫ్ అన్నాడు. ఫాస్ట్‌బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని అతడు చెప్పుకొచ్చాడు.

మహ్మద్ కైఫ్ జట్టు:
శుభ్‌మన్ గిల్, రోహిత్‌ శర్మ, చేటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కిషన్‌ కిషన్‌, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్/శార్దూల్‌ ఠకూర్‌, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌. 

జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, మార్నస్ లాబూషేన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లయోన్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్.

Also Read: Keerthy Suresh Hot Pics: బ్లాక్ శారీలో మెరిసిపోతున్న కీర్తి సురేష్.. వెన్నెల అందం మరో లెవెల్! పిక్స్ వైరల్  

Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుదో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.

 

Trending News