Delhi Capitals registered highest innings total of IPL 2022 so far: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో.. ఢిల్లీ 44 రన్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌ (61; 45 బంతుల్లో 6×4, 2×6), పృథ్వీ షా (51; 29 బంతుల్లో 7×4, 2×6) అర్ధ శతకాలతో రాణించగా.. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (54; 33 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. దాంతో ఐపీఎల్ 2022లో ఢిల్లీ తన పేరుపై ఓ రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 211 రన్స్ చేసి రెండో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ 210 పరుగులు చేసి మూడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (210), పంజాబ్ కింగ్స్ (208), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (205) 15వ సీజన్లో 200లకు పైగా స్కోర్ చేశాయి. 



రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ టోర్నీలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లో ఉంది. 2013లో పూణే వారియర్స్ ఇండియాపై ఏకంగా 263 రన్స్ చేసింది. 2016లో గుజరాత్ లయన్స్ జట్టుపై మరోసారి 248 పరుగులు చేసింది బెంగళూరు. 2011లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ జట్టుపై చేసిన 231 పరుగులే ఇప్పటివరకు ఆ జట్టుకు అత్యధిక స్కోర్. మొత్తంగా ఢిల్లీ మెగా టోర్నీలో 8 సార్లు 200లకు పైగా స్కోర్ చేసింది. 


Also Raed: Pragya Jaiswal: ఈ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో.. బాలయ్యబాబు హీరోయిన్‌పై ట్రోలింగ్!


Also Read: Anasuya Bharadwaj: పండగంతా అనసూయలోనే కనిపిస్తోంది.. 'అబ్బ' ఎంత ముద్దుగా ఉందో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook