CSK Vs PBKS: LIVE మ్యాచ్ లో గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసిన దీపక్.. హోరెత్తిన స్టేడియం
గురువారం రోజున పంజాబ్ కింగ్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో దీపక్ చాహర్ లైవ్ మ్యాచ్ లో ప్రేయసికి ప్రపోజ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ వీడియో మీకు ఒక సారి చూడండి.
Deepak Chahar Proposes To His Girl Friend During Match: ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ మ్యాచ్ లు దుబాయిలో (Dubai) జరుగుతున్నా సంగతి తెలిసిందే.. అయితే గురువారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings) - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేస్తుకుంది.
అదేంటంటే, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు దీపక్ చార్ (Deepak Chahar) లైవ్ మ్యాచ్ (LIVE Match) లో గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోస్ చేసాడు.. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. మ్యాచ్ అయ్యాక, స్టాండ్స్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరకి వెళ్లాడు.
Also Read: Degree third councelling in Telangana: డిగ్రీలో 2 లక్షలకుపైగా మిగిలిన సీట్లు
మోకాలిపై కూర్చొని జేబులోంచి రింగ్ తీసి గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసాడు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవటంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. రింగులు మార్చుకున్న తరువాత ప్రేమికులిద్దరు.. కౌగిలిలో, ముద్దులతో ప్రపంచాన్నే మర్చిపోయారు.
సన్నిహితుల మధ్య లైవ్ మ్యాచ్ లో ఈ తంతు జరగ్గా... క్రీడా ప్రపంచం మొత్తం దీన్ని వీక్షించింది. టీమిండియా ఆటగాళ్ల తో సహా మొత్తం క్రికెట్ ప్రపంచం లవ్ బడ్స్ కు విషెస్ తెలిపింది.
అయితే కొంత మంది దీపక్ చార్ పై ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు మ్యాచ్ జరుగుగుతుండగా.. దానిపై ఏకాగ్రత పెట్టకుండా ఇలాంటి పని ఏంటని ప్రశ్నిస్తుండగా.. మరి కొంత మంది మంచి పని చేసావు అంటూ మద్దతు తెలుపుతున్నారు .
ఎందుకు ఇలా చేసాడో తెలీదు కానీ.. నిన్నటి రోజు మాత్రం దీపక్ చాహర్ (Deepak Chahar), తన ప్రేయసికి జీవితాంతం గుర్తిండిపోతుంది. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి మరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి