Degree third councelling in Telangana: డిగ్రీలో 2 లక్షలకుపైగా మిగిలిన సీట్లు

Degree third councelling in Telangana, DOST councelling latest updates: హైదరాబాద్: తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ఇంకా 2 లక్షలకు పైగా సీట్లు మిగిలిపోయానని ఉన్నత విద్యామండలి చైర్మన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2021, 09:53 AM IST
Degree third councelling in Telangana: డిగ్రీలో 2 లక్షలకుపైగా మిగిలిన సీట్లు

Degree third councelling in Telangana, DOST councelling latest updates: హైదరాబాద్: తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ఇంకా 2 లక్షలకు పైగా సీట్లు మిగిలిపోయానని ఉన్నత విద్యామండలి చైర్మన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (DOST) మూడో విడత పూర్తయ్యే సరికి 1,96,691 మంది విద్యార్థులు మాత్రమే ఆయా కాలేజీల్లో చేరారని లింబాద్రి పేర్కొన్నారు. 

Also read : Home loans Interest rates: పీఎన్‌బీ, ఐసిఐసిఐ, LIC HFL, ఐసిఐసిఐ, BOB, SBI హోమ్ లోన్స్

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 947 డిగ్రీ కాలేజీల్లో 4,16,575 సీట్లు అందుబాటులో ఉన్నాయి:  దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి.

అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో 2,19,884 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయని వెల్లడించిన లింబాద్రి (R Limbadri). 

మూడు విడతల కౌన్సెలింగ్స్ (DOST councelling) నాటికి 2,12,143 మంది ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేసినట్టు చెప్పిన ఆర్ లింబాద్రి.

Also read : Anaconda train video: అనకొండ లాంటి 2.4 కి.మీ పొడవైన రైలు చూశారా ? ఇదిగో వీడియో

ఇంట్రా కాలేజీ ఫేజ్‌‌లో (Intra college phase councelling) సీటు పొందాలనుకునే విద్యార్థులకు నేటి వరకే గడువు. 

ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (B.Tech, MBBS, BDS cources) ప్రవేశాల ప్రక్రియ ఇంకా ముగియలేదు.

తెలంగాణలో పేరున్న డిగ్రీ కాలేజీల్లో (Top degree colleges, DOST) సీట్లు భర్తీ అయినట్టు సమాచారం.

Also read : Huzurabad bypolls: హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారిపై సీఈసీ శశాంక్‌ గోయెల్‌కు YS Sharmila ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News