Dewald Brevis: బేబీ ఏబీ తుఫాన్ ఇన్నింగ్స్.. 57 బంతుల్లోనే 162 పరుగులు
Dewald Brevis Smashes 162 Runs in CSA T20 Challenge: సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 57 బంతుల్లో 162 పరుగులు చేసి.. ప్రత్యర్థి బౌలర్లను చితకబాదాడు.
Dewald Brevis Smashes 162 Runs in CSA T20 Challenge: సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. టైటాన్స్ తరఫున ఆడుతున్న బ్రెవిస్.. నైట్స్‌పై 57 బంతుల్లో 162 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 13 సిక్సర్లు బాదడం విశేషం. ఏబీ డివిలియర్స్ తరహాలో ఆడుతుండడంతో ఈ యంగ్ క్రికెటర్‌ను అందరూ బేబీ డివిలియర్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు.
టీ20ల్లో మూడో వ్యక్తిగత అత్యధిక స్కోరును బ్రెవిస్ సమం చేశాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (175), ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ (172), హామిల్టన్, మసకద్జా (162 నాటౌట్) టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేశారు.
నైట్స్‌పై మ్యాచ్‌లో బ్రెవిస్ 284.21 స్ట్రైక్ రేట్‌తో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. నైట్స్ బౌలర్లు ఎవరినీ వదలకుండా ఉతికి ఆరేశాడు. బ్రెవిస్ తుఫాను ఇన్నింగ్స్‌తో టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నైట్స్ కూడా బాగానే పోరాడింది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 230 పరుగులు చేసింది. చివరికి 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బ్రెవిస్.. 35 బంతుల్లోనే సెంచరీ మార్క్ దాటేశాడు. దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో ఇదే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. సెంచరీ చేసిన తరువాత కూడా ఏ మాత్రం జోరు తగ్గించకుండా.. 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 57 బంతుల్లో 162 రన్స్ చేశాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లో కూడా బ్రెవిస్ అద్భుతాలు చేశాడు. సూపర్‌మ్యాన్ స్టైల్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
ఫీల్డింగ్‌లోనూ డివిలియర్స్‌ను గుర్తు చేశాడు.'డెవాల్డ్ బ్రెవిస్, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు' అంటూ ఏబీ డివిలియర్స్ ట్వీట్ చేశాడు. సౌతాఫ్రికా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ డెవాల్డ్ బ్రెవిస్‌పై ప్రశసంలు వర్షం కురిపించాడు. బ్రెవిస్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ చూస్తున్నానని.. రాబోయే మరో 15 ఏళ్లు బౌలర్లు సీరియస్ ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారని అన్నాడు.
Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
Also Read: Bigg Boss Faima : ఫైమాకు మూడింది.. వెటకారం మరీ ఎక్కువైంది.. ఈ వారం బయటకు వచ్చేస్తుందోచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి