Bigg Boss Faima : ఫైమాకు మూడింది.. వెటకారం మరీ ఎక్కువైంది.. ఈ వారం బయటకు వచ్చేస్తుందోచ్!

Bigg Boss 6 Telugu 9th Week Nominations బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం నామినేషన్లో ఎవరి నిజ స్వరూపాలేంటో బయటకు వచ్చాయి. ఇందులో ఫైమా కాస్త హద్దులు దాటినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 09:51 AM IST
  • బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం రచ్చ
  • నామినేషన్స్‌లో పది మంది కంటెస్టెంట్లు
  • ఫైమాకు మూడినట్టే ఉందిగా
Bigg Boss Faima : ఫైమాకు మూడింది.. వెటకారం మరీ ఎక్కువైంది.. ఈ వారం బయటకు వచ్చేస్తుందోచ్!

Bigg Boss Faima : బిగ్ బాస్ ఇంట్లో ఫైమా చేస్తోన్న కామెడీ అందరికీ తెలిసిందే. అయితే అది కామెడీ అని ఒక్కోసారి అనిపిస్తున్నా.. కొన్ని సార్లు మాత్రం వెగటు పుట్టిస్తుంటోంది. ఫైమా తన ఒరిజినాలిటీని చూపించడం లేదనిపిస్తోంది. ఫైమా ఎంత సేపు జబర్దస్త్ స్టేజ్ మీద నటించినట్టుగా, చేసినట్టుగానే ఓవర్ యాక్షన్ చేస్తోంది. పైగా వెటకారం ఎక్కువైందని చెబితే.. నేను ఇంతే.. నేను నటించేటప్పుడు ఇలానే వస్తుంది.. నాకు అది అలవాటు అని చెప్పేస్తోంది. అంటే బిగ్ బాస్ ఇంట్లోనూ నటిస్తోందా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.

ఇక నిన్న ఫైమా చేసిన ఓవర్ యాక్షన్ మాత్రం గీతూని మించిపోయింది. బాలాదిత్య తన కారణాలు చెబుతూ ఫైమాను నామినేట్ చేశాడు. బాలాదిత్య ఎలాగైతే నామినేట్ చేస్తాడో అదే విధంగా నామినేట్ చేస్తూ ఇమిటేట్ చేసింది ఫైమా. నువ్ బయటకు వెళ్లాలని నామినేట్ చేయడం లేదు.. ఇది నామినేషన్ ప్రాసెస్ కాబట్టి చేస్తున్నా అంటూ వెటకారంగా అనేసింది. ఇక తన నామినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే బిగ్ బాస్ ఎడిటర్లకు కూడా ఓ సూచన చేసింది. వెటకారం ఎక్కువైతే దాన్ని ఎడిట్ చేయండని చెప్పింది. కానీ అది కూడా మితిమీరిన వెటకారంతోనే అనేసింది.

అలా ఫైమా తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటోంది. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున పొగుడుతుండటంతో..ఆ పొగరు తలకు ఎక్కినట్టుగా అనిపిస్తోంది. ఫైమా తీరు ముందు నుంచి కూడా కాస్త వింతే. తనకు సపోర్ట్ చేస్తే ఒకలా. చేయకపోతే ఇంకోలా అన్నట్టుగా ఉంటుంది. తన కోసం తాను కాకుండా.. పక్క వాళ్లను ఓడించేందుకు ఎక్కువగా ఆడుతుంటుంది. అందుకే ఫైమా ఇంత వరకు ఒక్క టాస్కులోనూ విజయం సాధించలేకపోయింది. తన మార్క్ వేయలేకపోయింది.

ఇక నిన్నటి నామినేషన్స్‌లో ఫైమా మరింతగా దిగజారిపోయినట్టుగా కనిపించింది. వెటకారం ఎక్కువైందని నన్ను నామినేట్ చేశావ్ కదా?.. నీకు మంచితనం ఎక్కువైంది.. అందుకే నామినేట్ చేస్తున్నా అని పిచ్చి కారణం చెప్పింది ఫైమా. ఇలాంటి పనులు చేసి ఫైమా తన ఇమేజ్ తానే తగ్గించుకుంటోంది. ఇలాంటి పిచ్చి కారెక్టర్లను జనాలు ఎప్పటికీ విన్నర్‌ని చేయరని తెలుసుకోలేకపోతోంది. తప్పులు చేస్తే అంగీకరించాలి.. సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి.

అలాంటి వారికే బిగ్ బాస్ ఇంట్లో ఎక్కువ కాలం ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. లేదంటే ఆడియెన్స్ ఇంటికి పంపిచేస్తారు. నిన్నటి నామినేషన్స్‌లో ఫైమా హద్దులు దాటేసింది. వెటకారం తన ఒళ్లంతా ఉందన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంది. ఇక శ్రీహాన్ సైతం తనకు తాను ఎక్కువగా ఊహించుకుని ఏవో పిచ్చి కారణాలతో నామినేషన్ చేసేస్తున్నాడు. శ్రీహాన్ తన చేజేతుల తానే విన్నింగ్ అవకాశాలను కోల్పోతోన్నాడనిపిస్తోంది.

Also Read : Rambha Family Car Accident : హీరోయిన్ రంభ ఫ్యామిలీకి ప్రమాదం.. కారు యాక్సిడెంట్‌తో హాస్పిటల్లో.. కూతురిపై ఎమోషనల్ పోస్ట్

Also Read : Manjima Mohan Lovestory : నా బతుకు అయిపోయిందన్న టైంలో వచ్చావ్!.. బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మంజిమా మోహన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News