భారత రెగ్యులర్‌ టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తాజాగా ధోని పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2014లో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో ధోని అత్యధికంగా తొమ్మిది క్యాచ్‌లు పట్టి ఆ ఘనత సాధించిన తొలి భారత్ వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. అయితే ఆ రికార్డును తాజాగా సాహా బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సాహా 10 క్యాచ్‌లు పట్టి ధోని రికార్డును బ్రేక్ చేశాడు.


తద్వారా టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్‌ కీపర్‌గా సాహా వార్తల్లోకెక్కాడు. అయితే సాహాతో పాటు ఇదే ఘనతను మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా దక్కించుకోవడం విశేషం. వారే  బాబ్ టేలర్ మరియు ఆడమ్ గిల్‌క్రిస్ట్. 1980లో భారత్‌పై ఈ రికార్డును టేలర్ నమోదు చేయగా..  గిల్‌క్రిస్ట్ 2000లో న్యూజిలాండ్ పై ఈ ఘనతను సాధించాడు.