ఔనా..ఇది నిజామా..టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీకి మళ్లీ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడమేంటి అని ఆశ్యర్యపోకండి.. ఇది వాస్తవమైనప్పటికీ .. తాత్కాలికమేనట.. విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ టోర్నీకి విరాట్ కోహ్లీ అందుబాటులో లేని కారణంగా అతని స్థానంలో రోహిత్ శర్మ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఫైనల్ కు చేరిన టీమిండియా.. నామమాత్రంగాఆఫ్ఘనిస్థాన్ తో తలపడుతోంది. ఈ నేపధ్యంలో ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ కు విశ్రాంతి కల్పించారు. ఈ క్రమంలో అతని స్థానంలో జట్టులో సీనియర్ అయిన మహేందర్ సింగ్ ధోనీకి జట్టును నడిపించే బాధ్యతలు అప్పగించారు.


ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు


ఆప్ఘాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహారిస్తున్న ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తో  200 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన ఘనతను సాధించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్సీ చేపట్టిన ధోనీ.. ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ  200వ వన్డేకు కెప్టెన్ గా వ్యవహరించాలని రాసిపెట్టినట్టుంది..అందుకే ఇది ఇప్పుడు సాధ్యపడిందని చమత్కరించాడు.