IPL PLAY OFF RACE 2022: ఐపీఎల్‌ మ్యాచ్‌ లు కీలకదశకు చేరుకున్నాయి. లీగ్‌ దశ మ్యాచ్‌ లు ముగిసేందుకు సమయం దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా కేవలం ముంబై ఇండియన్స్‌ మాత్రమే అధికారికంగా లీగ్‌ నుంచి నిష్క్రమించింది. మిగతా తొమ్మిది జట్లు కూడా ప్లే ఆఫ్‌ పోరులో నిలిచాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో ఎనిమిది మ్యాచులు గెలిచింది. మరో మ్యాచ్‌ గెలిస్తే ప్లే ఆఫ్‌ బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకుంటది. ఒకవేళ మూడు మ్యాచుల్లో రెండు గెలిస్తే టేబుల్‌ టాప్‌ -2లో నిలుస్తది. పది టీంలతో పోల్చితే లక్నో నెట్‌ రన్‌ రేట్‌ కూడా మెరుగ్గా ఉంది. హార్ధిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ జట్టు కూడా ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో ఎనిమిది గెలిచింది. గుజరాత్‌ జట్టు మరో మ్యాచ్‌ గెలిస్తే ప్లే ఆఫ్‌ లో చోటు సంపాధించుకున్నట్టే. మిగతా మూడు మ్యాచుల్లో గుజరాత్‌ రెండు గెలిచినా కూడా 20 పాయింట్లకు చేరుకుంటది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్‌ రాయల్స్‌ ఆడిన 11 మ్యాచుల్లో ఏడింట్లో గెలిచి.. 14 పాయింట్లతో మెరుగైనస్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ రాజస్థాన్‌ మిగతా మూడు మ్యాచుల్లో ఏ ఒక్కటి గెలిచినా ఫ్లే ఆఫ్‌ లో చోటు కన్ఫామే. అయితే గుజరాత్‌ రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచి.. రాజస్థాన్‌ మిగతా మూడు మ్యాచుల్లో గెలిస్తే .. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవనుంది. ఒకవేళ గుజరాత్‌, రాజస్థాన్‌ పాయింట్లు సమంగా ఉంటే నెట్‌ రన్‌ రేట్‌ ను పరిగణలోకి తీసుకుంటారు. 


ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 12 మ్యాచుల్లో ఏడు విజయాలు సాధించింది. మిగతా రెండు మ్యాచుల్లో గెలిచినా ఆర్సీబీకి 18 పాయింట్లు వస్తాయి. రెండు మ్యాచుల్లోనూ ఆర్సీబీ గెలిస్తే ఫ్లే ఆఫ్‌లో చోటు సంపాదిస్తది.  ఒకవేళ ఒక్క మ్యాచ్‌ లో ఓడినా ఢిల్లీ క్యాపిటల్స్‌, హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు ఫ్లే ఆఫ్‌ కు పోటీకి వస్తాయి. అలా రావాలంటే ఈ మూడు జట్లు కూడా మిగతా మ్యాచుల్లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైతే.. ప్లే ఆఫ్‌ కు క్వాలిఫై కాలేదు. ఎందుకంటే ఆర్సీబీతో పోల్చితే హైదరాబాద్‌, ఢిల్లీకి మంచి రన్‌ రేట్‌ ఉంది.


11 మ్యాచుల్లో ఢిల్లీ ఐదింట్లో గెలిచింది. ఒక్క మ్యాచ్‌ ఢిల్లీ ఓడిపోయినా.. ఫ్లే ఆఫ్‌ ఆశలు ముగిసినట్టే. ఇక సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ప్లే ఆఫ్‌ ఆశలు ఆర్సీబీ, ఢిల్లీ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆర్సీబీ, ఢిల్లీ ఒక్క మ్యాచ్‌ లో ఓడి.. హైదరాబాద్‌ మిగతా మ్యాచుల్లో గెలిస్తే ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడగా.. అందులో 5 మ్యాచులు గెలిచింది. ఆర్సీబీ ఒక్క మ్యాచ్‌ లో ఓటమిపాలై.. పంజాబ్‌ మిగతా అన్ని మ్యాచుల్లో భారీ పరుగుల తేడాతో గెలిస్తే మంచి రన్‌ రేట్‌ సాధిస్తది. అప్పుడు పంజాబ్‌ జట్టుకు ప్లే ఆఫ్‌ వెళ్లే అవకాశం వస్తది. పంజాబ్‌ తన తర్వాత మ్యాచ్‌ లు ఆర్సీబీ, ఢిల్లీ, హైదరాబాద్‌ తోనే ఆడాల్సి ఉంది.  


కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. కోల్‌ కతా 14 పాయింట్లతో ప్లే ఆఫ్‌ కు చేరాలంటే తర్వాత మూడు మ్యాచుల్లో భారీ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది.  అప్పుడు ఆర్సీబీ తన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. అటు చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌, పంజాబ్‌ జట్లు కనీసం ఒక్క మ్యాచైనా ఓడిపోవాలి.అది కూడా నెట్‌ రన్‌ రేట్‌ భారీగా ఉంటేనే కోల్‌ కతా ప్లేఆఫ్‌ కు చేరుకునే అవకాశం ఉంటది.  


ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా 11 మ్యాచులు ఆడింది. అందులో 4 విజయాలు సాధించింది. చెన్నై ప్లే ఆఫ్‌ చేరాలంటే మిరాకిల్స్‌ జరగాల్సి ఉంటుంది.  చెన్నై ఆడే అన్ని మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు ఆర్సీబీ కూడా అన్ని మ్యాచుల్లో ఓటమి చెందాలి.  ఢిల్లీ, హైదరాబాద్‌, పంజాబ్‌ జట్టు కూడా భారీ తేడాతో ఒక్కో మ్యాచ్‌ ఓడిపోవాలి. ఇక ఇక ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ లీగ్‌ దశలోనే ఇంటి బాట పట్టింది.


Also Read: Yashwant Sinha Comments: అన్ని మతాల్ని నిషేధించి..హిందూ దేశంగా ప్రకటించేయండి


Also Read:Cyclone Asani Live Updates: తీవ్ర తుపాను మారిన 'అసని'... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook