ఒమిక్రాన్ కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికా పర్యటనపై నీలినీడలు
టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ టూర్‌పై సందిగ్దత నెలకొంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన భయంకరమైన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరగడమే దీనికి కారణం.
టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ టూర్‌పై సందిగ్దత నెలకొంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన భయంకరమైన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరగడమే దీనికి కారణం.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) బి.1.1.529 ప్రపంచాన్ని భయపెడుతోంది. డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంతో సంక్రమించే గుణముండటం, ప్రమాదకరం కావడంతో ఆందోళన ఎక్కువవుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు ఇజ్రాయిల్ దేశంలో కూడా ఈ కేసులు బయటపడ్డాయి. ఒమిక్రాన్ కేసుల నేపధ్యంలో ఇప్పటికే అమెరికా, బ్రెజిల్, కెనడా, జపాన్, థాయిలాండ్, ఈయూ వంటి దేశాలు దక్షిణాఫ్రికాకు చెందిన దేశాల నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఇండియా ఇంకా నిషేధం విధించలేదు.
వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి జనవరి 26 వరకూ మూడు టెస్ట్‌మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు , నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ముగిసిన తరువాత ఇప్పుడు త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ ఇండియా సిద్ధమౌతున్న తరుణంలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం దక్షిణాఫ్రికా పర్యటనపై(South Africa Tour)నీలినీడలు అలముకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తూ తగిన నిర్ణయం తీసుకుంటామని బోర్డు చెబుతోంది. ఆటగాళ్ల రక్షణే తొలి ప్రాధాన్యత అని..అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తే భారత ప్రభుత్వ అనుమతితోనే దక్షిణాఫ్రికా వెళ్తామంటోంది టీమ్ ఇండియా క్రికెట్ బోర్డు. ప్రభుత్వం అంగీకరిస్తే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లడానికే టీమ్ ఇండియా క్రికెట్ భావించడం విశేషం.
Also read: Shreyas Iyer: డ్యాన్స్ తో అదరగొట్టిన రోహిత్, శ్రేయస్..వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook