Shreyas Iyer: డ్యాన్స్ తో అదరగొట్టిన రోహిత్, శ్రేయస్..వీడియో వైరల్

టీమిండియా ఆటగాళ్లు రోహిత్, శ్రేయస్, శార్దుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ లో శ్రేయస్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 12:25 PM IST
Shreyas Iyer: డ్యాన్స్ తో అదరగొట్టిన రోహిత్, శ్రేయస్..వీడియో వైరల్

IND vs NZ: కివీస్(New Zealand)తో జరుగుతున్న అరంగ్రేట మ్యాచ్ లోనే  టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)సెంచరీతో చెలరేగి..తన ఎంట్రీని గ్రాండ్ గా చాటుకున్నాడు. తన తొలి మ్యాచ్ లోనే శతకం సాధించిన 16వ భారత ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ముంబై నుంచి ఈ ఫీట్ అందుకున్న మూడో ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు. అంతకు ముందు రోహిత్ శర్మ, పృథ్వీ షా డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీలతో అదరగొట్టారు. 

Also Read: Shreyas Iyer: ఇక నేను జట్టులో ఉండననుకున్నా.. అతడివల్లే క్రికెట్ ఆడుతున్నా: శ్రేయస్

తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన  శ్రేయస్ అయ్యర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) వేదికగా శుభాకాంక్షలు తెలిపిన హిట్‌మ్యాన్‌.. తాను, అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌ కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు అద్బుతంగా ఆడావు.. అంతా బాగా జరుగుతుంది అంటూ రోహిత్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియోలో శ్రేయస్‌ ముందుండి డ్యాన్స్‌ చేయగా.. రోహిత్‌,, శార్దూల్‌ అతడిని అనుకరిస్తూ స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News