కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా దినేష్ కార్తీక్
ఎట్టకేలకు ఐపీఎల్-11 సీజన్‌లో తలపడే కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న దానిపై ఉత్కంఠ వీడిపోయింది.
ఎట్టకేలకు ఐపీఎల్-11 సీజన్‌లో తలపడే కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న దానిపై ఉత్కంఠ వీడిపోయింది. అనేక తర్జన భర్జనల అనంతరం దినేష్ కార్తీక్ పేరును కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గత సీజన్‌లో గుజరాత్ లయన్స్‌కు ఆడిన కార్తీక్‌ను ఈ సీజన్ కోసం కేకేఆర్ యాజమాన్యం రూ.7.4 కోట్లు చెల్లించి వేలంలో సొంతం చేసుకుంది.
తొలుత ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు క్రిస్‌లిన్‌ను కెప్టెన్‌గా చేద్దామని భావించిన కేకేఆర్.. అతడు గాయపడటంతో జట్టు కెప్టెన్ బాధ్యతలను కార్తీక్‌కు అప్పగించారు. రాబిన్ ఊతప్ప పేరు కూడా కెప్టెన్ పేర్లలో వినిపించింది. గౌతమ్ గంభీర్ పదవీకాలం ఆదివారంతో ముగిసిపోవడంతో తదుపరి కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ పేరును ఫ్రాంఛైజీ సీఈఓ వెంకీ మైసూర్ ప్రకటించారు. కేకేఆర్ స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమం 'నైట్ క్లబ్'లో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
కేకేఆర్ జట్టు వివరాలు: దినేష్ కార్తీక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప (వైస్ కెప్టెన్), సునీల్ నరైన్, ఆండ్రీ రుస్సెల్, క్రిస్ లిన్, మిచెల్ స్టార్క్, కులదీప్ సింగ్ యాదవ్, పీయూష్ చావ్లా, నితీశ్ రానా, కమలేశ్ నాగర్ కోటి, శివమ్ మావి, మిచెల్ జాన్సన్, శుభ్‌మన్ గిల్, రంగనాథ్ వినయ్ కుమార్, రింకు సింగ్, కేమరూన్ డెల్ పోర్ట్, జావోన్ సీర్ లెస్, అపూర్వ్ విజయ్ వాంఖడే, ఇశాంక్ జగ్గీ