Dinesh Karthik says Yuzvendra Chahal struggles after Dhoni retirement: ప్రస్తుత భారత జట్టులో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)లా యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ప్లేయర్స్ లేరని టీమిండియా సీనియర్‌ ఆటగాడు, వ్యాఖ్యాత దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) అన్నాడు. మహీ లేకపోవడం వల్లనే మణికట్టు స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ లాంటి వారు విఫలమవుతున్నారన్నాడు. మైదానంలో వికెట్ల వెనకాల నుంచి ధోనీ ఇచ్చే సలహాలు యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడేవని డీకే అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్‌గా వ్యవహరించినా.. యువ ప్లేయర్స్ మాత్రం సలహాల కోసం ధోనీ వైపే చూసేవారని కార్తిక్‌ పేర్కొన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండేళ్ల క్రితం వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో యుజ్వేంద్ర చహల్‌ (Yuzvendra Chahal), కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేసి జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఒకానొక దశలో వీరి దెబ్బకు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా మధ్య పోటీ నెలకొంది. అయితే మహీ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం కుల్చా జోడి బౌలింగ్ గతితప్పింది. ప్రస్తుతం వీరు ఫామ్‌ లేమీతో సతమతమవుతున్నారు. చహల్‌ అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్నా.. కుల్దీప్ మాత్రం మ్యాచ్ ఆడి చాలా కాలమైంది. 


Also Read: Katrina Kaif Honeymoon: మాల్దీవ్స్‌లో హనీమూన్‌.. హాట్ ఫొటోలు షేర్ చేసిన కత్రినా కైఫ్!!


'ఎంఎస్ ధోనీ అందించిన ప్రోత్సాహంతోనే యుజ్వేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్‌ టీమిండియాలో కీలక స్పిన్నర్లుగా ఎదిగారు. ప్రత్యర్థి బ్యాటర్లు స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లు ఆడుతున్నప్పుడూ.. వికెట్ల వెనుక నుంచి మహీ ఇచ్చే సలహాలు వాళ్లిద్దరికీ బాగా ఉపయోగపడేవి. మాజీ సారథి సలహా మేరకు సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులేస్తూ వికెట్లు పడగొట్టేవారు. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు' అని క్రిక్ బజ్‌తో భారత వికెట్ కీపర్ దినేశ్‌ కార్తిక్‌ అన్నాడు.


'చాలా మ్యాచులకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించినా యువ ఆటగాళ్లకు మాత్రం ఎంఎస్ ధోనీనే సూచనలు, సలహాలు ఇచ్చేవాడు. మహీపై వారికి అపార నమ్మకం ఉండేది. ఆటగాళ్లెవరైనా మెరుగ్గా రాణిస్తున్నంత కాలం ఎవరూ వేలెత్తి చూపరు. కానీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువ ఆటగాళ్లు పూర్తి స్థాయి క్రికెటర్లుగా ఎదిగేందుకు మహీ  అందించిన సహకారం మరువలేనిది' అని డీకే పేర్కొన్నాడు. 


Also Read: Smriti Mandhana: ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా 'స్మృతి మంధాన'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook