Mohali Test Dispute: టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక టీ20 సిరీస్ ముగిసింది. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా ఇప్పుడు టెస్ట్ సిరీస్‌పై కన్నేసింది. మొహలీలో తొలిటెస్ట్ ప్రారంభానికి ముందు..బయటపడిన బుల్లెట్లు కలకలం రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా - శ్రీలంక మధ్య తొలి టెస్ట్ మార్చ్ 4 నుంచి మొహలీ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికీ టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా మొహలీ టెస్ట్ సిరీస్ కోసం సన్నాహాలు చేస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ కెరీర్‌లో వందవ టెస్ట్ మ్యాచ్. కోహ్లీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ మ్యాచ్‌కు స్డేడియంలో ప్రేక్షకుల్ని అనుమతించే విషయంపై వివాదం రేగుతోంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అనుమతి నిరాకరించడంతో..కోహ్లీ అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. బెంగళూరులో జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతిని కర్ణాటక క్రికెట్ అసోసియేన్ అంగీకరించినప్పుడు మొహలీ తొలి టెస్టుకు ఎందుకు అంగీకరించలేదనేది కోహ్లీ అభిమానుల ప్రశ్న. 


మరోవైపు మొహలీ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు శ్రీలంక క్రికెటర్ల శిబిరంలో ఇవాళ ఒక్కసారిగా కలకలం ప్రారంభమైంది. శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు లలిత్ హోటల్ నుంచి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు బయలు దేరింది. దారిలో జరిగిన సాధారణ పోలీసు తనిఖీల్లో..ఆ బస్సు లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో రెండు బుల్లెట్ షెల్స్ కన్పించాయి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. లంక క్రికెటర్ల కోసం అద్దెకు తీసుకున్న బస్సుును..అంతకుముందు ఓ పెళ్లి కోసం వినియోగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. చండీగఢ్‌లోని తారా బ్రదర్శ్ ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి ఈ బస్సును అద్దెకు తీసుకున్నారు. 


Also read: IND vs SL 3rd T20: ఇషాన్, బుమ్రా ఔట్.. హైదరాబాద్ ఆటగాడికి చోటు! శ్రీలంకతో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook