Dinesh Karthik tweet goes viral after he gets place in Indias T20 World Cup 2022 Squad: ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్‌ 2022లో తలపడే భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. రోహిత్‌ శర్మ నేతృత్వంలో తొలిసారి ప్రపంచకప్‌ ఆడబోతున్న భారత జట్టులో 15 మంది సభ్యులకు బీసీసీఐ చోటిచ్చింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, ఐపీఎల్ స్టార్ హర్షల్‌ పటేల్‌ పునరాగమనం చేశారు. వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. పేసర్ మహమ్మద్‌ షమీ, కీపర్‌ సంజూ శాంసన్‌లకు నిరాశే ఎదురైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ ఫినిషర్‌ కోటాలో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2022 జట్టులో చోటు దక్కిన అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జట్టును ప్రకటించిన కొద్ది నిమిషాల్లో ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. 'కలలు నిజమవుతాయి' అంటూ పేర్కొన్నాడు. ఈ ఒక్క మాటతో ప్రపంచకప్‌ ఆడాలన్న తన కల నెరవేరిందని చెప్పకనే చెప్పాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఆడిన దినేశ్‌ కార్తీక్‌.. 15 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక కావడం ఆసక్తికరం. డీకే 2019 వన్డే ప్రపంచకప్‌ ఆడి నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2022లో మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన డీకే.. 16 మ్యాచ్‌లలో 55 సగటు, 83.33 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. కీపర్‌, బ్యాటర్‌గా రాణించాడు. దాంతో ఐపీఎల్ అనంతరం భారత్ ఆడిన ప్రతి టీ20 సిరిసులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుత డీకే ఫామ్ చూస్తే.. ప్రపంచకప్‌ తుది జట్టులో కూడా కచ్చితంగా ఆడతాడు.


తనకు భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉందని, కచ్చితంగా పొట్టి ప్రపంచకప్‌ ఆడుతానని ఐపీఎల్ 2022కు ముందు దినేశ్‌ కార్తీక్‌ చాలాసార్లు పేర్కొన్నాడు. భారత జట్టులో ఆడేందుకు తానింకా ప్రాక్టీస్‌ చేస్తున్నానని, ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించేది లేదని డీకే చెప్పాడు. చెప్పినట్టే భారత జట్టులో ఆడాడు. ఇప్పుడు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అందుకే అతడు భావోద్వేగ పోస్ట్ చేశాడు. డీకే భారత్ తరఫున ఇప్పటివరకు 26 టెస్టులు, 94 వన్డేలు మరియు 50 టీ20లు ఆడాడు.



ప్రపంచకప్‌ 2022కు భారత జట్టు: 
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్ పంత్‌ (కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, ఆర్ అశ్విన్‌, యుజ్వేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.
స్టాండ్‌ బై ప్లేయర్లు: మహమ్మద్‌ షమీ, శ్రేయాస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌, దీపక్‌ చహర్‌. 


Also Read: 'రెబల్ స్టార్' ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌతిండియా స్టార్‌గా..!


Also Read: Sanju Samson - Shami: బీసీసీఐ డ్రామాలాడుతోంది.. ట్రెండింగ్‌లో సంజూ, షమీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook