Prabhas Ravana Effigy: 'రెబల్ స్టార్' ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌతిండియా స్టార్‌గా..!

Prabhas will burn Ravan's effigy on Dusshera 2022 Celebrations.  ఈ ఏడాది ఢిల్లీలోని ల‌వ్‌కుశ్ రాంలీలా మైదానంలో 'రావ‌ణ ద‌హ‌నం' చేసేందుకు ప్రభాస్‌కు ఆహ్వానం అందింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 13, 2022, 09:10 AM IST
  • ప్రభాస్‌కు అరుదైన గౌరవం
  • తొలి సౌతిండియా స్టార్‌గా
  • ప్రభాస్‌ను మించిన అతిథి మరొకరు లేరు
Prabhas Ravana Effigy: 'రెబల్ స్టార్' ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌతిండియా స్టార్‌గా..!

Prabhas will burn Ravan's effigy on Dusshera 2022 Celebrations: పాన్ ఇండియా హీరో, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఢిల్లీలోని ల‌వ్‌కుశ్ రాంలీలా మైదానంలో 'రావ‌ణ ద‌హ‌నం' చేసేందుకు ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. అక్టోబ‌ర్ 5న ద‌స‌రా సంద‌ర్భంగా రావ‌ణుడి దిష్టి బొమ్మ‌ను ద‌గ్ధం చేసేందుకు ముఖ్య అతిధిగా హాజ‌రు కావాల‌ని ల‌వ్‌కుశ్ రాంలీలా క‌మిటీ పాన్ ఇండియా హీరోని ఆహ్వానించింది. ఆదిపురుష్‌ సినిమాలో రాముడి పాత్ర‌ను పోషిస్తున్న హీరో ప్ర‌భాస్ కంటే మరో హీరో పేరు తమకు ప్రత్యామ్నాయంగా కనిపించలేదన్నారు. 

సెప్టెంబ‌ర్ 26 నుంచి ద‌స‌రా వేడుక‌లు ప్రారంభం కానుండ‌గా.. ఈ ఏడాది ల‌వ్‌కుశ్ రాంలీలా క‌మిటీ ఎర్రకోట వ‌ద్ద అయోధ్య‌లోని రామాల‌యం థీమ్‌పై మండ‌పాన్ని ఏర్పాటు చేస్తోంది. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి చిహ్నంగా రావణుడి దిష్టి బొమ్మ‌ను ద‌గ్ధం చేయడం ఈ కమిటీ ఆనవాయితీ. 10 తలల రావణాసురుడి భారీ విగ్రహాన్ని దగ్ధం చేయడానికి సెలబ్రిటీలను ఈ కమిటీ ఆహ్వానిస్తుంటుంది. ఈ ఏడాది ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. రావణ దహనం చేసేందుకు ‘ఆదిపురుష్‌’లో రాముడిగా కన్పించే ప్రభాస్‌ను మించిన అతిథి మరొకరు లేరని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. 

ఇదివరకు బాలీవుడ్ స్టార్స్ అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌, జాన్ అబ్ర‌హంలు రావ‌ణుడి దిష్టి బొమ్మ‌ను ద‌గ్ధం చేసేందుకు ముఖ్య అతిథిలుగా వచ్చారు. రావణాసుర దహన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న తొలి సౌతిండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. దాంతో ప్రభాస్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన జీవితంలో పెద్దదిక్కైన పెదనాన్న కృష్ణంరాజును కోల్పోయిన బాధలో ఉన్నాడు ప్రభాస్. వచ్చే నెలలో ఈ కార్యక్రమం ఉండడంతో డార్లింగ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభాస్ ఎమన్నా మనసు మార్చుకుంటాడేమో చూడాలి. 

మైథ‌లాజిక‌ల్ నేప‌థ్యంలో రామాయ‌ణం ఆధారంగా ‘త‌న్హాజీ’ ఫేం ఓం రౌత్ 'ఆదిపురుష్‌' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. భూష‌న్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టించాడు. ప్ర‌భాస్‌కు జోడీగా కృతిస‌న‌న్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

Also Read: Sanju Samson - Shami: బీసీసీఐ డ్రామాలాడుతోంది.. ట్రెండింగ్‌లో సంజూ, షమీ!

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా పసిడి ధర! పెరిగిన వెండి రేటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News