Zimbabwe Domestic T20: టీ20ల్లో చెత్త రికార్డ్ నమోందైంది. జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీలో ఓ జట్టు బ్యాట్స్‌మెన్ గల్లీ క్రికెట్ కంటే దారుణంగా బ్యాటింగ్ చేశారు. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు కేవలం 16 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 213 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. డర్హామ్‌తో జరిగిన ఫైనల్‌లో ఈగల్స్ టీమ్ 16 పరుగులకే ఆలౌట్ అయి.. T20ల్లో రెండో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఆ జట్టులోకి ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా 5 పరుగుల స్కోరు చేయలేదు. ఫైనల్లో ఒత్తిడి తట్టుకోలేక బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. గతంలో బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకు ఆలౌటై టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NEET UG 2024 Last Date: నీట్ 2024 కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు, గడువు పొడిగింపు


జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీలో డర్హామ్‌, ఈగల్స్ జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన డర్హామ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆలీ రాబిన్‌సన్‌, హేడెన్‌ మస్టర్డ్‌, బాస్‌ డి లీడ్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడి భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. లీడ్ 29 బంతుల్లో 58 పరుగులు చేయగా.. రాబిన్సన్ 20 బంతుల్లో 49 రన్స్ బాదాడు. మస్టర్డ్ 22 బంతుల్లో 46 పరుగులు చేశాడు.


230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్స్ బ్యాట్స్‌మెన్ కనీసం క్రీజ్‌లోకి నిలబడేందుకు కూడా పోటీపడలేదు. బంతి పడితే వికెట్ అన్నట్లుగా సాగింది ఇన్నింగ్స్. 8.1 ఓవర్లలోనే 16 రన్స్‌కే చాపచుట్టేసింది. దీంతో టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా ఓ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది. ఐదుగురు డకౌట్ అయ్యారు. 49 బంతుల్లోనే ఆ జట్టు మొత్తం పెవిలియన్‌కు చేరింది. కెప్టెన్ చము చిభాభా, తపివా ముఫుద్జా తలో 4 పరుగులు చేశారు. కెగ్ ఇర్విన్, నిక్ వెల్ష్, హమ్జా షాహిద్, టినాషే కమున్హుకమ్వే, తాడివషన్ మారుమణి ఖాతా కూడా తెరవలేకపోయారు. డర్హామ్ బౌలర్లలో కల్లమ్ పార్కిన్సన్, పాల్ కొగ్లిన్, ల్యూక్ రాబిన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో దుమ్ములేపిన బాస్ డి లీడ్ బౌలింగ్‌లో కూడా రాణించి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.  


Also Read: Mukesh Ambani: ముకేశ్ అంబానీ చదువుకున్న స్కూల్ ఇదే.. అప్పట్లో ఫీజు ఎంత చెల్లించేవారో తెలిస్తే ఫ్యూజులు అవుట్..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter