CSK legend Dwayne Bravo IPL Retirement: వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ అతన్ని రిలీజ్ చేసి.. బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఐపీఎల్ 2023కి పొలార్డ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరో విండీస్ దిగ్గజం ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇకపై ఐపీఎల్‌లో కనిపించే అవకాశం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్‌ 23న కొచ్చి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మినీ ఆక్షన్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్‌ చేయడానికి నవంబర్‌ 30తో గడువు ముగిసింది. ఐపీఎల్‌ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు ఉన్నారు. విండీస్ జాబితాలో డ్వేన్ బ్రావో పేరు లేదని తెలుస్తోంది. దీంతో డ్వేన్ కూడా ఐపీఎల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


డ్వేన్ బ్రావో తన ఐపీఎల్ ప్రయాణంను ముంబై ఇండియన్స్‌తో మొదలెట్టాడు. ఆ తర్వాత 2011లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిశాడు. అప్పటి నుంచి చెన్నై తరఫున అద్భుతంగా రాణించాడు. 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ బ్రావో ముద్దాడాడు. తన కెరీర్‌లో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడిన బ్రావో.. 158 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2022లో 10 మ్యాచుల్లో 16 వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ రికార్డును అతడు బద్దలు కొట్టాడు.


ఐపీఎల్ 2023 కోసం కేవలం 14 మంది ఆటగాళ్లను మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్‌ రిటైన్ చేసుకుంది. డ్వేన్ బ్రావోతో పాటు రాబిన్ ఊతప్ప, నారాయణ్ జగదీశన్, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే లాంటి స్టార్ ప్లేయర్లను కూడా వదిలేసింది. వీరిలో ఊతప్ప కొన్ని రోజుల క్రితమే క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. బ్రావో కూడా అదే బాటలో నడుస్తాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. 


Also Read: BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ రేసులో వెంకటేష్.. ఆ అనుభవం కలిసిరానుందా?


Also Read: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇది నాలుగోసారి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook