David Warner Test Retirement: వచ్చే ఏడాది టెస్టుల నుంచి రిటైర్మెంట్ అవుతానని ఇప్పటికే ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే వార్నర్ టెస్ట్ కెరీర్ ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుం కంగారూ జట్టు ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఈ సిరీస్‌లో వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగిలిన రెండు టెస్టులకు జట్టులో చోటు కష్టంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే వార్నర్ భార్య క్యాండీస్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. "టెస్ట్ క్రికెట్‌లో మాకు ఒక శకం ముగిసింది. ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం. అద్భుతమైన ప్రయాణం. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. లవ్ యూ డేవిడ్ వార్నర్.." అంటూ రాసుకొచ్చారు. తన భర్త డేవిడ్ వార్నర్, కుమార్తెలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. 


ఈ పోస్ట్‌తో వార్నర్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి ఈ ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 2024 జనవరిలో సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం రిటైర్మెంట్ అవుతానని వార్నర్ ప్రకటించాడు. అయితే ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉండడంతో జట్టులో చోటు కష్టంగా మారింది. యాషెస్ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు వార్నర్ ప్లేస్‌లో మరోకరిని తీసుకునే అవకాశం ఉంది. తరువాత పాక్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా ఎంపిక కావడం కష్టమే. క్యాండీస్ వార్నర్ పోస్ట్‌ను చూస్తుంటే వార్నర్ టెస్ట్ కెరీర్‌ ముగిసినట్లేనని క్రికెట్ అభిమానులు అంటున్నారు. 


36 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరపున 107 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 44.61 సగటుతో 8343 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 107 వన్డేల్లో 44.67 సగటుతో 6030 రన్స్ చేశాడు. 19 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు బాదాడు. టెస్టులో వార్నర్ అత్యధిక స్కోరు 335. బాల్ ట్యాంపరింగ్ వివాదం వార్నర్ టెస్ట్ కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఘటన.


Also Read: Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమునా నది


Also Read: YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి